Share News

పరిపాలన తీరుపై విద్యార్థినులకు అవగాహన

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:16 AM

జిల్లాలో ప్రజలకు పరిపా లన ఏ విధంగా అందుతోందనే అంశంపై విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్‌ ముజ మ్మిల్‌ ఖాన్‌ అన్నారు.

పరిపాలన తీరుపై విద్యార్థినులకు అవగాహన

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 24 : జిల్లాలో ప్రజలకు పరిపా లన ఏ విధంగా అందుతోందనే అంశంపై విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్‌ ముజ మ్మిల్‌ ఖాన్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం వేడుకల అనంతరం బాలికలతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలను సందర్శించి వాటి పనితీరును వివరించారు. జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలం నుంచి కలెక్టర్‌ వ్యవస్థ ఉందని, గతంలో భూ పన్ను వసూలు చేసేందుకు ఈ వ్యవస్థను ఉపయోగించే వారని, మనకు స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభా య్‌ పటేల్‌ సూచనల మేరకు మన దేశంలో ప్రజా అను కూల పాలన అందించేందుకు దోహదపడేందుకు కలెక్టర్‌ల వ్యవస్థను కొనసాగించారని అన్నారు. ప్రస్తుతం ప్రజల ఆశయాల సాధన దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని, ప్రజలకు వివిధ రకాల సేవలు ఒకే చోట నుంచి అందించాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్‌లను నిర్మించు కున్నామని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందే సేవలు, నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్‌ వివరిం చారు. అనంతరం పిల్లలతో కలిసి మ్యూజియంను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన చారిత్రక అంశాలను వివరించారు. సుమారు 20 కోట్ల సంవత్సరాల నుంచి 6 కోట్ల సంవత్సరాల క్రితం నాటి వృక్ష శిలాజాలు, డైనోసార్‌ ఎముక శిలాజాలు, చేప శిలాజాలు, పాతరాగి యుగం పనిము ట్లు, శాతవాహన, బ్రిటీష్‌ కాలానికి చెందిన నాణేలు, మొదలైనవి మ్యూ జియంలో ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. మన పెద్దపల్లి జిల్లాలో ప్రాముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను కలెక్టర్‌ విద్యార్థుల కు వివరించారు. జిల్లాలోని ప్రముఖమైన ప్రదేశాలకు విద్యార్థులను త్వర లో ఎడ్యుకేషన్‌ టూర్‌ తీసుకొని వెళ్లడానికి కార్యాచరణ రూపొందిస్తున్నా మని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి శ్రీనివాస్‌, సుల్తానాబాద్‌, అంతర్గాం కేజీబీవీ విద్యార్థునులు, సుల్తానాబాద్‌ సెయింట్‌ మెరిస్‌ స్కూల్‌ విద్యార్థినులు, సంబంధిత అధికారులు, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 12:16 AM