Share News

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాటం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:28 AM

కాంగ్రెస్‌ హామీలపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాటం

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 19 : కాంగ్రెస్‌ హామీలపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. నామినేషన్‌ అనంతరం బస్టాండు వద్ద శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసం గించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి జరగగా, 3 నెలల కాం గ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యమించినట్లే ప్రజా సమస్యలు, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సంక్షేమ పథకాలు అందించిన ఘనత నాటి సీఎం కేసిఆర్‌కే దక్కిందన్నారు. దేశం లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమం, అభివృ తమ హయాంలో సాధించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి సోయి లేకుండా మాట్లాడడం విడ్డూరమన్నారు. సింగరేణి కార్మికుడిగా ప్రజల కష్టాలు తెలిసిన తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజా సంక్షేమం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరింపులకు పాలఁడుతున్నారని కాంగ్రెస్‌పై మం డిపడ్డారు. సంక్షేమ రాజ్యం కోసం పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ను గెలిపించా లని కోరారు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే వెంటాడు తామని హెచ్చరించారు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇచ్చిన హామీలు అమ లు జరగాలని గ్రామాల్లో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కాం గ్రెస్‌ అభ్యర్థికి ప్రజల కష్ట సుఖాలు తెలియవని, చుట్టపు చూపులా వచ్చే వారికి ఓట్లేయద్దని ప్రజలను కోరారు. కుబేరుడైన వివేక్‌ కుటుంబంతో సామన్యుడైన తాను ఎదురొడ్డి ఎన్నికల్లో పోరాడుతున్నానని, తన గెలుపు ప్రజల గెలుపుకు నాం ది కావాలని కోరారు. రోడ్‌ షోలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, కోలేటీ దామోదర్‌, గంట రాములు, రఘువీర్‌ సింగ్‌, దాసరి ఉష, ఓరుగంటి రమణ రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:28 AM