బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:44 PM
బాలకార్మికుల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

పెద్దపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బాలకార్మికుల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమా వేశ మందిరంలో మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిర క్షణ విభాగం (డీసీపీయూ) ద్వారా నిర్వహించిన ఆపరే షన్ స్మైల్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై, గతంలో చేపట్టిన ముస్కాన్ కార్యక్రమం వివరాలను జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్ ఖాన్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కమలాకర్‌లు వివరించారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ బాలకార్మికుల ను వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించడానికి అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సమ న్వయంతో పనిచేసి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడాల ని తెలి పారు. అనంతరం వాల్‌పోస్టర్లను కలెక్టర్, అదనపు కలెక్టర్, సంబం ధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీధర్, సి.ఐ. బి.అనిల్, మైనారిటీ సంక్షేమ అధికారి మేరాజ్ మహమూద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభి వృద్ధి అధికారి జే రంగారెడ్డి, జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు, జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి, ఇంటర్‌మీడియెట్ జిల్లా అధి కారి కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, ఈ.డి. ఎస్సీ కార్పొ రేషన్ మధుసూదన చారీ, డి.ఎస్.సి. డి.ఓ. నాగలైశ్వర్, డి.వై.ఎస్.ఓ. సురేష్, పాఠశాల అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పి.ఎం. షేక్, తదితరులు పాల్గొన్నారు.