Share News

పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

ABN , Publish Date - May 03 , 2024 | 12:03 AM

అవాంఛనీయ సంఘటనలు జర గకుండా చూడాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ అన్నారు.

పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

కోల్‌సిటీ, మే 2: అవాంఛనీయ సంఘటనలు జర గకుండా చూడాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా కేంద్ర బలగాల అధికారులతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ గురువారం బ్రీఫింగ్‌ సెషన్‌ నిర్వహించారు. రామగుండం పోలీస్‌ కమిష నరేట్‌ కార్యాలయంలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఏపీఎఫ్‌), రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పోలీ స్‌ అధికారులతో సీపీఎం శ్రీనివాస్‌ సమావేశమయ్యా రు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు రామగుండం కమిషనరేట్‌ పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్‌ రోజు, ఎన్నికల తరువాత, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద, కౌంటింగ్‌ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా నియంత్రించడమే లక్ష్యంగా బందోబస్తు నిర్వ హించాలన్నారు. ఓటర్లకు భయాందోళనలకు అవకా శం లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేయ డంలో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్‌ మార్చ్‌, రూట్‌ మార్చ్‌, బందోబస్తు నిర్వహించనున్నట్టు పేర్కొన్నా రు. ఎన్నికల రోజు, ఎన్నికల తరువాత బందోబస్తు విధులు నిర్వర్తించాలని, ఎన్నికల రోజు ఎల్‌డబ్ల్యూ ఈ పోలింగ్‌ స్టేషన్లు, క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌లలో స్టాటిక్‌ బందోబస్తు, మిగతా ఫోర్స్‌ రూట్‌ బందోబస్తు, అత్యవసర పరిస్థితి సమయంలో విధులు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. ఎస్‌ఎస్‌టీ టీమ్స్‌ డ్యూటీ లు, ఎల్‌డబ్ల్యూఈ ఏరియాలో ఏరియా డామినేషన్‌, కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌, విధుల గురించి వారికి వివ రించారు. కీలకమైన పాయింట్ల వద్ద సెంట్రల్‌ఫోర్స్‌ సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. కేంద్ర బలగాలు ఉండడానికి సరైన వసతి ఏర్పాట్లు చేయాలని, వారితో కలిసి పనిచేయాలని ఏసీపీలను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల భద్రతలో భాగంగా రామగుం డం పోలీస్‌ కమిషనరేట్‌కు ఐదు కంపెనీలు రాగా రెం డు సీఆర్‌పీఎఫ్‌, మూడు బీ ఎస్‌ఎఫ్‌ కంపెనీ బలగాలు ఉండగా, అందులో మొత్తం అధికారులు, సిబ్బంది 443 మంది ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీ పీ చేతన, మంచిర్యాల డీసీపీ అశోక్‌ కుమార్‌, అడిష నల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, సీఆర్‌పీఎఫ్‌ అడిషనల్‌ కమాండెంట్‌ ఏకే పాండే, పరమానంద్‌యాదవ్‌, బీఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్లు డేవిడ్‌ లాల్‌ తనసిమ్మ, భరత్‌ సింగ్‌, స్వరూప్‌ సమంత, డిప్యూటీ కమాండెంట్లు రతన్‌ లాల్‌, నరేష్‌ కేఆర్‌ షేరన్‌, ఏసీ పీలు పెద్దపల్లి జి. కృష్ణ, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్‌ ఏసీపీలు ప్రతాప్‌, సురేంద్ర, మంచిర్యాల ఇన్‌స్పెక్టర్‌ బన్సీలాల్‌, బెల్లంపల్లి రూరల్‌ సీఐ అఫ్జలొద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:03 AM