Share News

నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:22 AM

పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతం గా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశా మని పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధి కారి ముజమ్మిల్‌ ఖాన్‌, రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు.

నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతం గా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశా మని పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధి కారి ముజమ్మిల్‌ ఖాన్‌, రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఆయన రామగుండం పోలీ స్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌, డీసీపీ ఎం చేతనతో క లిసి కలెక్టరేట్‌ గేట్‌ నుంచి రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌ వరకు కల్పించాల్సిన భద్రతను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్‌ ఎన్నిక లకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రి ల్‌ 25వరకు జరుగుతుందని, భారత ఎన్నికల కమి షన్‌ మార్గదర్శకాల ప్రకారం పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉన్నామని, నామినేషన్‌ వేసే అభ్య ర్థులను పూర్తి సౌకర్యాలతో రిసీవ్‌ చేసుకునేందుకు, నామినేషన్‌ పత్రాలను జాగ్రత్తగా తీసుకునే విధం గా సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. నామినేషన్ల స్వీకరణ తర్వాత నామినేషన్ల స్కూట్రీని ప్రక్రియ, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపునకు పూర్తిస్థాయిలో సన్నద్ధం గా ఉన్నామని అన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకొని వస్తే వారి నామినేషన్‌ దాఖలు ప్రక్రియ త్వరగా ముగు స్తుందని, సజావుగా ప్రశాంత వాతావరణంలో నా మినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సన్న ద్ధంగా ఉన్నామని తెలిపారు. రామగుండం పో లీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ నామి నేషన్‌ స్వీకరణ ప్రక్రియ జరిగే కలెక్టరేట్‌ లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద మూడం చెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కలెక్టరేట్‌ గేటు వద్ద పోలీస్‌ అధికారు లు మొదటి దశలో, ఆర్మ్‌ ఫోర్స్‌తో రెండవ దశ లో, రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌ వద్ద పారా మిలిటరీ ఫోర్స్‌తో మూడవ దశలో భద్రత ఉంటుందని తెలిపారు. నామినేషన్‌ వేసే సమ యంలో ర్యాలీ నిర్వహించే అభ్యర్థులు ముంద స్తుగా సువిధా యాప్‌ ద్వారా దరఖాస్తు చేసు కోవాలని, ఫస్ట్‌కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ విధానంతో ర్యాలీ లకు అనుమతిచ్చి, అవసరమైన భద్రత కల్పి స్తామన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఎంట్రీ,ఎగ్జిట్‌ వేర్వే రు పాయింట్లు ఏర్పాటుచేశామని, ఎగ్జిట్‌ పాయిం ట్‌ వద్ద వాహనాల పార్కింగ్‌ సౌకర్యం కల్పించామ న్నారు. నామినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు అభ్యర్థులు సైతం సహకారం అందించాలని పోలీస్‌ కమిషనర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ క్రిష్ణ, సీఐ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:22 AM