Share News

రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 24 , 2024 | 12:36 AM

మంథని మున్సిపల్‌ పరిధిలోని, కూరగాయ ల మార్కెట్‌ ఏరియాలో వ్యాపారులు రోడ్లను ఆక్రమిం చి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్‌పెండ్రి రమ-సురేష్‌రెడ్డి హెచ్చరిం చారు.

రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు

మంథని, మే 23: మంథని మున్సిపల్‌ పరిధిలోని, కూరగాయ ల మార్కెట్‌ ఏరియాలో వ్యాపారులు రోడ్లను ఆక్రమిం చి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్‌పెండ్రి రమ-సురేష్‌రెడ్డి హెచ్చరిం చారు. స్థానిక కూరగాయల మార్కెట్‌ను, ప్రధాన రహ దారిని మున్సిపల్‌ చైర్మన్‌పెండ్రి రమ-సురేష్‌రెడ్డి గురు వారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ వ్యాపారులకు పలు సూచనలు చేసి తప్పకుండా పాటించాలన్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలకు, వాహన దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లో కూరగాయలను అమ్మకూడద న్నారు. వ్యాపారస్తులకు ఎంత అయితే కేటాయించిన స్థలాలు ఉన్నాయో వాటిలో మాత్రమే ఉపయోగించుకో వాలని రోడ్లను ఆక్రమించి వాహనదారులకు సామాన్యు లకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. పలుమార్లు చెప్పినప్పటికి కొంతమంది వ్యాపారస్తులు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారస్తు లు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మార్కెట్లో ఉన్న గద్దెలను వినియోగించుకుంటూ రోడ్లపై అమ్మకాలు తగ్గించాలని కోరారు. పాడైపోయిన కూరగాయలను సైతం ఎక్కడపడితే అక్కడ వేయ కుండా మున్సిపల్‌కు సంబంధించిన వాహనాల్లో వేయాలని సూచిం చారు. రానున్న రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను శు భ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో మున్సిపల్‌ పరిధిలోని కూరగాయల మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తా మని అప్పటివరకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు.

Updated Date - May 24 , 2024 | 12:36 AM