Share News

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:52 PM

వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పమేలా సత్పతి హెచ్చరించారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 3: వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్‌ ఆడిటోరియంలో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ డాక్టర్లతో వైద్య సేవలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు వచ్చేటప్పుడు అన్ని వివరాలతో హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలన్నారు. వైద్యాధికారులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని, అపుడే మంచి పేరు వస్తుందన్నారు. గ్రామాలతోపాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధిహామి కూలీలు పనిచేసే చోట విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.మంచి పనితీరు కనబరిచినందుకు ఎన్‌క్యూఏఎస్‌ సర్టిఫికెట్లను వైద్యాధికారులకు కలెక్టర్‌ అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ జువేరియా, చందు, డీటీసీవో రవిందర్‌రెడ్డి, డీఎంవో రాజగోపాల్‌, డీఐవో సాజిదఅతహరి, ఎంసీహెచ్‌పివో సన జువేరియా పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:52 PM