Share News

విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:44 AM

విధులపై నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ అన్నారు.

విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
రికార్డులను పరిశీలిస్తున్న డీఈవో రమేష్‌

చందుర్తి, జూలై 5 : విధులపై నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ అన్నారు. చం దుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జడ్పీటీసీ నాగం కుమార్‌ సందర్శించిన సమయంలో విద్యార్థులు లేకపో వడం, ఉపాధ్యాయులు ఆలస్యంగా పాఠశాలకు హాజరు కావడంపై డీఈవో రమేష్‌ శుక్రవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న ఇద్దరు విద్యార్థులను సమీపంలోని జోగాపూర్‌ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామంలోని యూపీఎస్‌కు ఇద్దరు ఉపాధ్యాయులను, రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌కు ఇద్దరు ఉపాధ్యాయులను, ఒకరిని రుద్రంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు కేటాయిస్తామన్నారు. ఉన్నత అధికారుల అనుమతితో ప్రధాన ఉపాధ్యాయుడిని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న అప్‌ గ్రేడ్‌ అయిన పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపిస్తామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని ఆదేశించారు. అనంతరం జోగాపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను, చందుర్తి మండల కేంద్రంలోని కేజీబీవీని పరిశీలించారు. విద్యార్థుల స్థితిగతులను భౌతిక వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. ఆయన వెంట మండల విద్యాధికారి శ్రీనివాస్‌ దీక్షితులు, మండల మానిటరింగ్‌ అధికారి వినయ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 12:44 AM