Share News

రామగుండంలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:22 AM

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేని కట్టడాలపై కఠిన చర్యలు తీసు కోవాలని, ప్రాథమిక దశలోనే తొలగించాలన్నారు.

రామగుండంలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు

కోల్‌సిటీ, జనవరి 8: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేని కట్టడాలపై కఠిన చర్యలు తీసు కోవాలని, ప్రాథమిక దశలోనే తొలగించాలన్నారు. రోడ్డు ఆక్రమణలను సహించేది లేదని, ఎక్కడా రోడ్డు ఆక్రమ ణలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ముజ్‌మ్మిల్‌ ఖాన్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశిం చారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు. మూడు నెలల క్రితం తాను జరిపిన సమీక్షలో విభాగాల వారీగా లక్ష్యాలను నిర్దేశించానని, అవి ఎంతవరకు పూర్తి చేశారో చెప్పాలన్నారు. కార్పొరే షన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని, తీరు మార్చుకోవాలన్నారు. అనుమతి లేని కట్టడాలపై ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదని, కనీసం జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు కూడా సిఫార్సు చేయడం లేదన్నారు. ఇంత వరకు చర్యల నిమిత్తం జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఒక సిఫార్సు కూడా రాలేదంటే టౌన్‌ప్లానింగ్‌ విభాగం పనితీరు అర్థమవుతుందన్నారు. ఎక్కడా అనుమ తిలేని నిర్మాణాలు జరుగవద్దని, బేస్‌మెంట్లు, పిల్లర్ల స్థాయిలోనే తొలగిం చాలన్నారు. కార్పొరేషన్‌లో రోడ్ల ఆక్రమణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఆక్రమణల తొలగింపు చర్యలపై ప్రచారం నిర్వహించాలన్నారు. కార్పొరే షన్‌లో వందల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్‌లు కనబడుతు న్నాయని, వీటిలో చాలా వరకు అనుమతి లేనివి ఉన్నాయన్నారు. నిబం ధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని, రెవెన్యూ విభాగం ఫీజులు వసూలు చేయాలన్నారు. పారిశుధ్య విభాగం కార్పొరేషన్‌లో కీలకమైంద ని, కార్పొరేషన్‌ డంప్‌ యార్డుకు పెన్సింగ్‌ వేయాలన్నారు. ఇంటింటా చెత్త సేకరణ జరుగాలని, కార్పొరేషన్‌లోని వాహనాలను పూర్తి స్థాయిలో పూర్తి పని గంటలు వినియోగించాలన్నారు. వాణిజ్య ప్రదేశాలు, కల్యాణ మండ పాలు, షాదీఖానాలను ఎంపిక చేసుకుని చెత్త నిర్వహణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నగరంలో బయట చెత్త వేయకుండా చూడాల న్నారు. కార్పొరేషన్‌లో ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాల న్నారు. ఆస్థి పన్ను, నల్లాల బిల్లుల వసూళ్లు వందశాతం చేయాలన్నారు. కార్పొరేషన్‌ మార్కెట్లు, కాంప్లెక్స్‌ల నుంచి అద్దెలను పూర్తిస్థాయిలో వసూ లు చేయాలన్నారు. లీకేజీలను ఎప్పటికప్పుడు అరికట్టాలన్నారు. కార్పొరేష న్‌ పని తీరుపై కమిషనర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం జరుపాలని, తాను తుదుపరి నిర్వహించే సమావేశంలో రోడ్డు ఆక్రమణలు, ఆస్తి పన్ను, హోర్డింగ్‌లపై వచ్చే ఆదాయం, నీటి పన్ను, చెత్త నిర్వహణపై సంపూర్ణ నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో నగర కమిష నర్‌ నాగేశ్వర్‌, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:22 AM