అర్హులందరికీ ‘రుణమాఫీ’ అందేలా చర్యలు
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:21 AM
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న రుణ మాఫీ పథకం డబ్బులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 18005995459ను ఏర్పాటు చేశామ ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న రుణ మాఫీ పథకం డబ్బులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 18005995459ను ఏర్పాటు చేశామ ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లో రైతులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కింద లక్షన్నర వరకు రుణాలు ఉన్న 6లక్షల 40వేల మంది రైతు లకు సంబంధించి 6,190 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. అనంతరం కలెక్టర్ రెండవ విడతలో జిల్లాకు చెందిన 13,238 మంది రైతులకు 122 కోట్ల 43 లక్షల 26 వేల 652 రూపాయల మాఫీ చెక్కును రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు విడతల్లో కలిపి 42,965 మంది రైతులకు 271 కోట్ల రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నదని అన్నారు. రుణమాఫీ పథకంపై రైతులు ఫిర్యాదులను నమోదు చేస్తే 30 రోజులలో పరిష్కరిస్తామన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో 30 రకాల ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించామని, వాటన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. రేషన్ కార్డు రైతు రుణమాఫీ పథకం అమలుకు తప్పని సరికాదని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డును వినియోగిస్తున్నామని, భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలు అవుతుందని అన్నారు. అనంతరం రుణమాఫీ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమం త్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఎల్.డి.ఎం.వెంకటేష్, బ్యాంకర్లు, సంబంధిత అధి కారులు తదితరులు పాల్గొన్నారు.