Share News

రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:16 PM

రాష్ట్రస్థాయి చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌-2024 జూడో చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటిం చారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని 30 జి ల్లాల నుంచి 330 మంది క్రీడాకారులు హాజర య్యారు.

రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ప్రారంభం
జూడో పోటీలను ప్రారంభిస్తున్న డీవైఎస్‌వో శ్రీనివాస్‌, జూడో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, తదితరులు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌-2024 జూడో చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటిం చారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని 30 జి ల్లాల నుంచి 330 మంది క్రీడాకారులు హాజర య్యారు. పోటీలకు హాజరైన క్రీడాకారులకు ఆయా వెయిట్‌ కేటగిరీలకు సంబంధించి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. తొలిరోజు బాలుర విభా గంలో 35, 40, 60, 66 కిలోలలోపు విభాగాల్లో, బాలికల విభాగంలో 40, 44, 63, 70 కిలోల విభా గాల్లో పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో జూడో క్రీడకు కేరాఫ్‌ అడ్రస్‌గా కరీంనగర్‌ జిల్లా నిలుస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్య మిస్తున్నారని తెలిపారు. ఈ పోటీలతో ఎందరో నూతన క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖాధికారి వి శ్రీనివాస్‌గౌడ్‌ మా ట్లాడుతూ సీఎం కప్‌ జూడో పోటీల్లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ పోటీలకు 30 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకావడం అభినందనీయమన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, వెంకట్‌ ఫౌం డేషన్‌ వ్యవస్థాపకులు, సెపక్‌తక్రా జిల్లా అధ్యక్షుడు గంప వెంకట్‌, జిమ్నాస్టిక్‌ సంఘాల అధ్యక్షులు కన్న కృష్ణ, డి నిరంజనాచారి, కబడ్డీ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ సంపత్‌రావు, ఖో-ఖో సంఘ రాష్ట్ర రెఫరీ బోర్డు కన్వీనర్‌ వంగపల్లి సూర్యప్రకాశ్‌, భారత జూడో సంఘం కోశాధికారి కైలాసం యాదవ్‌, జిల్లా పెటా కార్యదర్శి ఎండీ యూనిస్‌ పాషా, టోర్నమెంట్‌ ఇన్‌చార్జి ఎన్‌ రాజు, తెలంగాణ ఒలింపిక్‌ సంఘ సభ్యులు సిలివేరి మహేందర్‌, రెఫ రీలు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:16 PM