Share News

శ్రీ ఆంజనేయం..

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:00 AM

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో శనివారం హనుమాన్‌ పెద్ద జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జయంతి సందర్భంగా తరలివచ్చిన భక్తజన కోటితో కొండగట్టు కిక్కిరిసింది.

శ్రీ ఆంజనేయం..

ఫ కొండగట్టు అంజన్నకు భక్తజన హారతి

ఫ అంజన్నను దర్శించుకున్న లక్షన్నరకు పైగా భక్తులు

ఫ ఘనంగా పెద్ద హనుమాన్‌ జయంతి

మల్యాల, జూన్‌ 1: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో శనివారం హనుమాన్‌ పెద్ద జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జయంతి సందర్భంగా తరలివచ్చిన భక్తజన కోటితో కొండగట్టు కిక్కిరిసింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం వరకు రామ లక్ష్మణ జానకీ జై.. బోలో హనుమాన్‌ కీ..., రామ భక్త హనుమాన్‌ కీ జై.. అనే అం జన్న దీక్షాపరుల సంకీర్తనలు కొండగట్టు క్షేత్రంను ఆవహించాయి. దీంతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో పులకించాయి. కొండపైన ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో కొండంతా మారుమోగింది. లక్షలాదిగా తరలివచ్చిన అంజన్న దీక్షాపరులు, భక్తులు నృత్యాలతో శ్రీరామ భక్తుడు హనుమంతుడిని తమ సంకీర్తనలతో కొలిచారు. రామదండును తలపిం చేలా శుక్రవారం రాత్రి నుంచి వచ్చిన దాదాపు లక్షకు పైగా వచ్చిన అంజ న్న దీక్షాపరులతో కొండంతా కిక్కిరిసిపోగా కొండగటు క్షేత్రం కాషాయ వర్ణాన్ని పులుముకుంది. రామనామ స్మరణలతో హోరెత్తింది. 41, 21, 11 రోజుల దీక్ష బూనిన అంజన్న దీక్షాపరులు కొండపైకి చేరుకుని, మాల విర మణ కోసం ఏర్పాటు చేసిన కల్యాణ కట్టలో దీక్షలు విరమించారు. ఘా ట్‌రోడ్డు, మెట్లదారి జేఎన్‌టీయూ మార్గం గుండా రామదండును తలపించే లా వచ్చిన దీక్షాపరులతో కొండంతా భక్తజన సాగరంగా మారింది.

ఫఘనంగా హనుమాన్‌ జయంతి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ బహుళ దశమి సందర్భంగా నిర్వహించే పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా అంజన్న సన్నిధిలో ఉదయం 3 గంటలకు తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారా యణములు, విశేష అభిషేకం, తులసీ అర్చన, శ్రీ స్వామివారికి పట్టు వస్త్రా లంకరణ, సహస్ర నాగవల్లి, అర్చన, హోమం, మహా పూర్ణాహుతితో పాటు ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక యజ్ఞాలను వేద పండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పండుగ ప్రత్యేక అధికారులు రామ కృష్ణ, వినోద్‌రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్‌, ఆలయ స్థానాచార్యులు తిరు క్కోవెల కపీంధర్‌, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేందర్‌ ప్రసాద్‌, రఘు, ఉపప్రధానర్చకులు చిరంజీవ స్వామి, మారుతీ ఆలయ అర్చకులు, సిబ్బం ది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫకిక్కిరిసిన దీక్ష విరమణ మంటపం

వేలాదిగా తరలివచ్చిన అంజన్న దీక్షాపరులతో కల్యాణ కట్టలో ఏర్పాటు చేసిన దీక్ష విరమణ మంటపం కిక్కిరిసింది. మాల విరమణ ఏర్పాట్లను ఆ లయ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. మాల విరమణ చేసిన భక్తు లు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి, మొక్కులు తీ ర్చుకున్నారు. జయంతి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఫ అంజన్నను దర్శించుకున్న విప్‌, ఎమ్మెల్యేలు

కొండగట్టులో జరుగుతున్న పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, చొప్పదండి, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విజయరమణరావు అంజన్న దర్శించుకు న్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల జరిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్‌కు చెందిన పద్మశాలి సంఘ ప్రతినిధులు తయారి చేసిన ప ట్టువస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం యాగశాలలో జరు గుతున్న త్రికుండాత్మక యాగంలో పాల్గొన్నారు

Updated Date - Jun 02 , 2024 | 02:00 AM