Share News

లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యాయం

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:04 AM

లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యా యం సాధ్యమని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్‌ టీ శ్రీనివాసరావు, గోదావరిఖని ప్రిన్సి పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌ మంజుల అన్నారు.

లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యాయం

కోల్‌సిటీ, జూన్‌ 8: లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యా యం సాధ్యమని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్‌ టీ శ్రీనివాసరావు, గోదావరిఖని ప్రిన్సి పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌ మంజుల అన్నారు. ఈ మేరకు అదనపు జిల్లా న్యాయ స్థానం, మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం వేరువేరుగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌కు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కక్షలు, కారణాలతో సాధించేది ఏమీ లేదన్నారు. క్షణికావేశంతో కేసుల పాలై సమ యం, డబ్బు వృధా చేసుకోరాదన్నారు. లోక్‌ అదాలత్‌ లో రాజీ కుదుర్చుకున్న కేసులకు ఎలాంటి అప్పీల్‌కు అవకాశం ఉండదన్నారు. అనంతరం అదనపు జిల్లా న్యాయస్థానంలో మూడు, మున్సిఫ్‌ కోర్టులలో క్రిమిన ల్‌, మోటార్‌ ఆక్సిడెంట్‌ బీమా, వరకట్నవేధింపులు, సివిల్‌ కేసులలో రాజీ కుదుర్చారు. మున్సిఫ్‌ కోర్టు అసి స్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నంది రవీందర్‌, నహీద ఫర్హీన్‌, లోక్‌అదాలత్‌ సభ్యులు ఎన్‌ కిషన్‌రావు, గుర్రాల రాజేందర్‌, కొసనూరి సతీష్‌, గాదె శ్రీలత, న్యాయవాదు లు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 12:04 AM