Share News

శృంగేరీకి వేములవాడ నుంచి ప్రత్యేక బృందం

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:19 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం విస్తరణ పనుల ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం శృంగేరీ పీఠం జగద్గురు భారతీ తీర్థ, పీఠాధిపతి విదుశేఖర భారతి స్వామిని కలవడానికి వేములవాడ నుంచి ప్రత్యేక బృందం వెళ్లింది.

శృంగేరీకి వేములవాడ నుంచి ప్రత్యేక బృందం
శృంగేరీ పీఠంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, బృందం సభ్యులు

సిరిసిల్ల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం విస్తరణ పనుల ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం శృంగేరీ పీఠం జగద్గురు భారతీ తీర్థ, పీఠాధిపతి విదుశేఖర భారతి స్వామిని కలవడానికి వేములవాడ నుంచి ప్రత్యేక బృందం వెళ్లింది. ఆలయ విస్తరణ నమూనాలను బృందం సభ్యులు అందించారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపట్టేందుకు అనుమతులను కోరారు. నమూనాలను పరిశీలించిన స్వాములు ఆలయ విస్తరణకు ముందుకెళ్లాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాజరాజేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించి సూచనలు చేస్తామని తెలిపారు. వేములవాడ నుంచి వెళ్లిన బృందంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సీఎంవో ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్‌, దేవస్థానం ఈవో వినోద్‌రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతి వళ్లినాయగమ్‌, శృంగేరీ పీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్‌ శర్మ, చంద్రగిరి శరత్‌శర్మ, డీఈ రఘునందన్‌ ఉన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:19 AM