Share News

గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN , Publish Date - May 26 , 2024 | 12:51 AM

గ్రామాల ఆభివృద్ధిపై ఆధికారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్‌ యార్డ్‌, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణాన్ని మండల అధికారులతో కలిసి శనివారం డీపీవో పరిశీలించారు.

గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
రుద్రంగిలో ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న డీపీవో వీరబుచ్చయ్య

జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య

రుద్రంగి, మే 25: గ్రామాల ఆభివృద్ధిపై ఆధికారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్‌ యార్డ్‌, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణాన్ని మండల అధికారులతో కలిసి శనివారం డీపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పకృతి వనాల్లో ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలను తోలగించాలన్నారు. శ్మషనవాటికలో నీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. తడి చెత్త, పోడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్‌ తయారు చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ద్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏంపివో సుధకార్‌, కార్యదర్శి రామ్‌దాస్‌, తదితరులు పాల్గోన్నారు.

ఫ ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి

వాణిజ్య సముదాయాల యజమానులు తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్స్‌ను తీసుకోవాలని డీపీవో వీరబుచ్చయ్య ఆన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుము భారీగా పెరిగిందని రుద్రంగి మండల కేంద్రంలోని వాణిజ్య సముదాయాల యజమానులు సూమారు 80 మంది గ్రామ పంచాయతీకి వచ్చారు. అక్కడే డీపీవో వీరబుచ్చయ్య ఉండటంతో వాణిజ్య సముదాయాల యజమానులు వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో దుకాణ సముదాయాన్ని బట్టి ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు కేటాయిస్తామన్నారు. ఎవరు కూడా ఆఫ్‌ లైన్‌లో ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు కట్టవద్దని, ఆఫ్‌లైన్‌లో చాలా మోసం జరుగుతుందని సూచించారు. అలాగే గ్రామంలో ప్రధాన రహదారి వెంట సెంట్రల్‌ లైటింగ్‌, వీధి దీపాలు వెలగడం లేదని డీపీవో దృష్టికి గ్రామస్థులు తీసుకురావడంతో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటమన్నారు. కార్యక్రమంలో ఎంపీవో సుధాకర్‌, కార్యదర్శి రామ్‌దాస్‌, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, భాసని ఓం ప్రకాష్‌, పిల్లమారపు ప్రవీణ్‌, మ్యాకల రమేష్‌, చిప్ప సుధకార్‌, పులి రాజేష్‌, చంద్రశేఖర్‌, మ్యాకల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

చందుర్తి: గ్రామపంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, పంచాయతీ కార్యదర్శులను డీపీవో వీరబుచ్చయ్య ఆదేశించారు. చందుర్తి మం డలం మర్రిగడ్డ గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, డంపింగ్‌ యార్డ్‌, కంపోస్ట్‌షెడ్డు, నర్సరీలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రదీప్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి నరేష్‌ ఉన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:51 AM