Share News

బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణి దోపిడీకి గురైంది

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:33 AM

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సింగరేణి దోపిడీకి గురైందని, సంస్థ నిధులు విచ్చలవిడిగా మళ్లించబడ్డాయని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణి దోపిడీకి గురైంది
సమావేశంలో మాట్లాడుతున్న జనక్‌ప్రసాద్‌

- ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌

యైుటింక్లయిన్‌కాలనీ, మార్చి 10: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సింగరేణి దోపిడీకి గురైందని, సంస్థ నిధులు విచ్చలవిడిగా మళ్లించబడ్డాయని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపా రు. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టిలు పలుమార్లు సింగరేణి స్థితిగతులపై సమీక్షించినట్టు తెలిపారు. సంస్థలో ఖాళీల భర్తీకి చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికే ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్లు జారీ అయ్యాయని అన్నారు. కారుణ్య నియామ కాల్లో భాగంగా ఏడాదికి 1000కిపైగా ఉద్యోగాలను భర్తీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టి సారించినట్టు జనక్‌ప్ర సాద్‌ తెలిపారు. సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని కోరుతూ ఇటీవల కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సెక్రెటరీని కలిసి విజ్ఞప్తి మేరకు తాడిచర్ల-2 బ్లాక్‌ను ఇవ్వడానికి అంగీకరించినట్టు జనక్‌ప్రసాద్‌ పేర్కొన్నా రు. తాడిచర్ల-2 బ్లాక్‌ 180 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, 30 ఏళ్ళ పాటు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా సింగరేణికి మణిహా రం కానున్నదని జనక్‌ప్రసాద్‌ తెలిపారు. ఈబ్లాక్‌ ద్వారా సింగరేణికి 400 కోట్లకు పైగా లాభం వచ్చే అవకాశం ఉన్నదన్నారు. కోయగూడెం-3ని ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టారని దాన్ని అడ్డుకుంటామని అన్నారు. రానున్న నాలుగేళ్లలో వెంకటాపురం, కేకే-6, శ్రావణపల్లి లాంటి కొత్త గనుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐఎన్‌టీయూసీ కృషి చేయనున్న ట్టు పేర్కొన్నారు. సంస్థ 100 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పయనిం చడంలో యూనియన్‌ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిం దని, ఆర్జీ-1లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. రామగుండం, శ్రీరాంపూర్‌ ఏరియా ల్లో మంచినీటి సరఫరా కోసం రాపిడ్‌ గ్రావిటీ ప్లాంట్‌ల ఏర్పాటు పనులు వారంలో మొదలు కానున్నట్టు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో దెబ్బతి న్న సింగ రేణి పూర్వవైభవం తీసుకురావడం, కార్మికుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ పనిచేస్తుందని జనక్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణరెడ్డి, నాయకులు ధర్మపురి, దాస్‌, శంకర్‌నాయక్‌, ఎట్టెం కృష్ణ, మార్కండేయ, కొంగర రవీందర్‌, సత్తయ్య, శ్రీనివాస్‌, ఆకుల రాజయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:33 AM