ప్రత్యేక ఐసీయూను ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:50 AM
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సింగరేణి కార్మిక కుటుంబాల కోసం 50పడకల ప్రత్యేక ఐసీయూ వార్డును ఏర్పాటు చేయా లని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దెల దినేష్, ఏఐటీయూసీ కాంట్రాక్టు అనుబంధ సంఘం అధ్యక్షులు ఎంఏ గౌస్ శనివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్‌ను కోరారు.

కళ్యాణ్‌నగర్, జూలై 27: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సింగరేణి కార్మిక కుటుంబాల కోసం 50పడకల ప్రత్యేక ఐసీయూ వార్డును ఏర్పాటు చేయా లని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దెల దినేష్, ఏఐటీయూసీ కాంట్రాక్టు అనుబంధ సంఘం అధ్యక్షులు ఎంఏ గౌస్ శనివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్‌ను కోరారు. మెడికల్ కళాశాల కోసం సింగరేణి యాజమాన్యం రూ.520కోట్లు మంజూరు చేసిందని, సింగరేణి కార్మిక కుటుంబా లకు, మాజీ కార్మిక కుటుంబాలకు ప్రత్యేకంగా ఆసుపత్రిలో 50పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ లేకపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు స్కానింగ్ కోసం ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని, దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. డయాగ్నోస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లను ఏర్పాటుచేయాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వారంవారం షిప్టులు చేంజ్ చేసే విధంగా చూడాలని, కార్మికులు తెలి సో తెలియకో చిన్నచిన్న తప్పులు చేస్తుంటే వారిని విధుల నుంచి తొలగించడం బాధాకరమన్నారు. కాంట్రాక్టు కార్మికులకు నెలనెల వేతనాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.