Share News

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:59 PM

జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సోమవారం మంచి ర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్‌ కేంద్రంలో నిర్వహిం చిన జిల్లాస్థాయి సైన్స్‌ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

   రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
విజేతలతో డీఈవో యాదయ్య

పోటీలను ప్రారంభించిన డీఈవో

ఏసీసీ, ఫిబ్రవరి 12: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సోమవారం మంచి ర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్‌ కేంద్రంలో నిర్వహిం చిన జిల్లాస్థాయి సైన్స్‌ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీలను డీఈవో యాదయ్య ప్రారంభించి మాట్లా డారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేం దుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్ధానాలు సాధించిన విద్యార్థులకు మెమోంటో, సర్టిఫికెట్లు అందించారు. సాధారణ వ్యర్ధాలు తగ్గించడం, ఈ వ్యర్ధాల నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవన విధా నం, సుస్ధిర ఆహారనియమాలు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను అరికట్టడం, నీరు, ఇంధన సంరక్షణ అం శాలపై పోటీలు నిర్వహించారు. పెయింటింగ్‌ విభా గంలో సానియా, ప్రథమ, సాయిదీప్తి ద్వితీయ, అక్షిత తృతీయ స్థాయిలో నిలిచారు. అలాగే పాటల పోటీల్లో అర్షిత ప్రథమ, స్నేహ ద్వితీయ, అలేఖ్య తృతీయ, కవిత్వం పోటీల్లో శ్రావ్య ప్రథమ, అఖిల ద్వితీయ, శ్రావణి తృతీయ, వ్యాసరచన పోటీల్లో పుష్పలత ప్రథమ, అంజి ద్వితీయ, హేస్మిత తృతీయ స్ధానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, హెచ్‌ఎంలు రాజగోపాల్‌, శ్రీనివాస్‌, న్యాయనిర్ణేతలు నారాయణరావు, ప్రసాద్‌, శ్రీనివాస్‌, మూర్తి, జ్యోతి, మంజుల, పోచయ్య, సాయిసంపత్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 11:59 PM