Share News

పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:42 AM

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 15: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం, తరగతి గదుల మరమ్మతు, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదికి విద్యుత్‌ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులను అమ్మ పాఠశాల కమిటీల ద్వారా జూన్‌10 వరకు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డీఈవో రమేష్‌ కుమార్‌, ప్రధానోపాధ్యాయుడు చొక్కి శ్రీనివాస్‌, ఉపాధ్యాయుడు రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:42 AM