కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా అక్రమ దందాలు
ABN , Publish Date - Apr 11 , 2024 | 12:27 AM
కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా అక్రమ దందాలు కొనసా గుతున్నాయని జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు ఆరోపించారు.
మంథని, ఏప్రిల్ 10: కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా అక్రమ దందాలు కొనసా గుతున్నాయని జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు ఆరోపించారు. తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గ ప్రజల ఆశీ ర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా ఎదిగిన తనపై కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల నుంచి దూరం చేశా రన్నారు. 2018, 2023 ఆసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో కోట్లాది రూపా యలు ఖర్చు చేసిన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో వారికి ఎదురు లేకుండా ఉండేలా చేసుకుంటున్నారన్నారు. ఇందు కోసం తనను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారన్నారు. జడ్పీ చైర్మన్‌గా ఉన్న తనకు గన్‌మెన్‌లు ఉండగా చంపడం వీలు కాదని, పదవీ కాలం ముగిసిన వెంటనే గన్‌మెన్లను తొలగించి చంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఖతం చేయడంతో పాటు నియోజకవర్గంలో మరో బీసీ నాయకుడు ఎదగ కుండా చూస్తున్నారన్నారు. మంథని నియోజకవర్గంలో ప్రతీరోజు ఏదో ఒక చోటు దొంగ లారీలు పట్టుబడుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుం చి ఇసుక, బియ్యం, మట్టి అక్రమ రవాణా దందాలు జోరుగా సాగుతున్నాయని, వీటి కి కాంగ్రెస్‌లోని కొంత మంది నాయకులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీస్‌స్టేషన్లలో సైతం పైరవీలకు కూడా ప్రత్యేకంగా ఇన్‌చార్జిలను నియమించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ఇసుక క్వారీలు నిర్వహించి వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత కూడా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారని, కానీ వీటిని అక్ర మంగా నిర్వహిస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రావడం లేద న్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులకు మాత్రమే ముడుపు లు ముడుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్న తనపై కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు చేశారన్నారు. తనకు ఇసుక లారీలు, క్వారీలు ఉన్నాయని ఆరోపించారని, ప్రస్తుతం వారి ప్రభుత్వ మే అధికారంలో ఉందని తనపై చేసిన ఆరోపణలు ఎందుకు రుజువు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మిన ప్రజలు నాలుగు నెలల కాలంలోనే అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా మంథని నియోజకవ ర్గ ప్రజలు చైతన్యవంతులై తనపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ వాళ్లను ప్రశ్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు జక్కు రాకేష్, తగరం శంకర్‌లాల్, కుమార్, రవిలు పాల్గొన్నారు.