Share News

సావిత్రీబాయి ఫూలే కృషి వెలకట్టలేనిది

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:27 PM

మహిళలకు విద్యను అందించేందుకు సావిత్రీబాయి ఫూలే చేసిన కృషి వెలకట్టలేనిదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

 సావిత్రీబాయి ఫూలే కృషి వెలకట్టలేనిది
నివాళులర్పిస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ, జనవరి 3 : మహిళలకు విద్యను అందించేందుకు సావిత్రీబాయి ఫూలే చేసిన కృషి వెలకట్టలేనిదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సావిత్రీ బాయి ఫూలే జయంతిని వేములవాడ పట్టణంలోని 19 వార్డులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి ఆది శ్రీనివాస్‌ పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే దేశంలో మొట్టమొదటి సంఘ సంస్కర్త, రచయిత అన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని అని, పీడిత ప్రజల, స్త్రీల విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి అమోఘం అని అన్నారు. తొలితరం మహిళా ఉద్యమకారిణిగా ఆమె ఉద్యమ స్పూర్తి, పోరాటపటిమ అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. స్థానిక కౌన్సిలర్‌ కుమ్మరి శిరీష, 14 వార్డు కౌన్సిలర్‌ బింగి మహేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:27 PM