Share News

సర్వాయి పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:41 PM

సర్దార్‌ సర్వాయి పాపన్న ఆనవాళ్లున్న పాపన్న గుట్టలను పర్యాటక కేంరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

సర్వాయి పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

సైదాపూర్‌, ఏప్రిల్‌ 2: సర్దార్‌ సర్వాయి పాపన్న ఆనవాళ్లున్న పాపన్న గుట్టలను పర్యాటక కేంరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం సర్వాయి పాపన్న వర్దంతి సందర్భంగా మంత్రి సర్వాయిపేట శివారులో గల కొమ్ముగట్ట వద్దకు వెళ్లి పాపన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్ఫించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన వీరుడు సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని, ప్రజల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాపన్న గుట్టలను సందర్శించి, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని సర్వాయిపేట వేదిక నుంచి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తాను ముఖ్యమంతితో మాట్లాడి సర్వాయి పాపన్న చరిత్రను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. పాపన్న గుట్టలను క్వారీలకు అనుమతి ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సైదాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని గొడిశాల గ్రామానికి వెళ్లి భారతదేశ సరిహద్దులో మృతి చెందిన ఆర్మీ జవాన్‌ నెల్లి రామకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గుండారపు శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మిట్టపెల్లి కిష్టయ్య, గౌడ సంఘం నాయకులు మాచర్ల ఆంజనేయులు, సమ్మెట సతీష్‌, మాచర్ల రమేష్‌, దేశిని కోటి, బుర్ర ముత్తయ్య, కాంగ్రెస్‌ నాయకులు రాజు, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:41 PM