Share News

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అందరికీ స్ఫూర్తి ప్రదాత

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:02 AM

బంజారాలకు ఆరాధ్య దైవమైన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అందరికీ స్ఫూర్తి ప్రదాత

కరీంనగర్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 28: బంజారాలకు ఆరాధ్య దైవమైన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా సప్తగిరికాలనీలోని సేవాలాల్‌ మందిర స్థలంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్‌ మహారాజ్‌ ధైర్యానికి మారుపేరు అని, దేశం కోసం బంజారాలు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. సేవాలాల్‌ మహారాజ్‌ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు, చింతకుంట ఎంపీటీసీ తిరుపతినాయక్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ నాయకులు లక్‌పతినాయక్‌, భాస్కర్‌ నాయక్‌, డీటీ నాయక్‌, భీమాసాహెబ్‌, తిరుపతి, రాజునాయక్‌, రవినాయక్‌, సంతోష్‌నాయక్‌, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:02 AM