Share News

మంథని నియోజకవర్గంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:27 AM

పెద్దపల్లి నియోజకవర్గంలో వలే మంథని నియోజకవర్గంలో కూడా స్యాండ్‌ ట్యాక్సీని రద్దు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నా రు.

మంథని నియోజకవర్గంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలి

పెద్దపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజకవర్గంలో వలే మంథని నియోజకవర్గంలో కూడా స్యాండ్‌ ట్యాక్సీని రద్దు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నా రు. గురువారం ఆయన కలెక్టర్‌ కోయ శ్రీహ ర్షను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంథని ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శ్రీధర్‌బా బు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం లో ఉన్న ఇసుక తాతముత్తాత ఆస్తియా, ఇసుకను డబ్బుల కు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని మాట్లాడారని, ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. రాజాపూర్‌ లో ఇసుక అక్రమ రవాణావల్ల ఒకరు మరణిస్తే, ఆ కుటుం బాన్ని పరామర్శించారే తప్ప చేసిందేమి లేదని మహదేవ్‌ పూర్‌ మండలం బెగుళూరులో ఇసుక దాహానికి కాంగ్రెస్‌ కార్యకర్త మరణిస్తే కేవలం 7 లక్షలే పరిహారం ఇప్పించార ని, తమ హయాంలో 20 లక్షలు ఇప్పించామని చెప్పారు. స్థానిక అవసరాలకు ఇసుక దొరకడం లేదని, మూడింతల డబ్బు వెచ్చించి ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్ప డిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలపై నమ్మ కం లేదని మాట్లాడిన శ్రీధర్‌బాబు స్థానిక అవసరాలకు ఇసుక ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి చెందిన వారేనని, ఆయన స్థానిక అవసరాలకు స్యాండ్‌ ట్యాక్సీతో సంబంధం లేకుండా ఉచితంగా ఇసుకను అందించే విధం గా ఏర్పాట్లు చేశారని, మంథని నియోజకవర్గ ప్రజలకు ఎందుకు ఉచితంగా ఇవ్వరని అన్నారు. ఆయన స్థానికంగా నివాసం ఉంటే ప్రజల సమస్యలు తెలిసేవని, మంథని ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను శ్రీధర్‌బాబు గుర్తుకు తెచ్చుకుని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తున్నట్లుగానే మంథని నియోజకవర్గ ప్రజలకు అం దించాలని పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తగరం శంకర్‌ లాల్‌, ఎగోళపు శంకర్‌గౌడ్‌, పూదరి సత్యనారాయణ, మైదం కు మార్‌, శెంకేసీ రవీందర్‌, భాస్కర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:27 AM