Share News

ఆర్జీ-3, ఏపీఏలో శాంప్లింగ్‌ మజ్దూర్‌ రాత పరీక్షలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:49 AM

సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపీఏ డివిజన్‌ పరిధిల్లో ఖాళీ ఏర్పడిన అంతర్గత శాంప్లింగ్‌ మజ్దూర్‌ పోస్టులకు ఆదివారం స్థానిక ఎంవీటీసీ కార్యాలయంలో రాత పరీక్షలను నిర్వహించారు.

ఆర్జీ-3, ఏపీఏలో శాంప్లింగ్‌ మజ్దూర్‌ రాత పరీక్షలు

రామగిరి, జనవరి 7: సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపీఏ డివిజన్‌ పరిధిల్లో ఖాళీ ఏర్పడిన అంతర్గత శాంప్లింగ్‌ మజ్దూర్‌ పోస్టులకు ఆదివారం స్థానిక ఎంవీటీసీ కార్యాలయంలో రాత పరీక్షలను నిర్వహించారు. 3 ఖాళీ(క్యాటగిరి-1) పోస్టులకు 96 మంది అర్హతగల కార్మికులు దరఖాస్తులు చేసుకోగా, 79 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాన్ని ఏపీఏ జీఎం వెంక టేశ్వర్లు, ఆర్జీ-3 ఇన్‌చార్జీ జీఎం రాధాకృష్ణలు పర్యవేక్షించారు. అనంతరం జీఎం కార్యాలయంలో ఫలితాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సీహెచ్‌ వెంకటరమణ, రవీందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మల్లన్న, శ్రీహరి, రాజేశం, మతీన్‌హుస్సేన్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:49 AM