Share News

ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్వరలో సమావేశం

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:55 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాల ప్రతినిధులతో త్వరలో సమా వేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్వరలో సమావేశం

భగత్‌నగర్‌, జనవరి 14: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాల ప్రతినిధులతో త్వరలో సమా వేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ప్రతినిధు లతో మాట్లాడారు. యూని యన్‌ నాయకులు మంత్రికి ఆర్టీసీ పరిస్థితులను వివరిం చారు. ఈ సందర్భంగా స్టాఫ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎన్‌టియుసి) రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ జక్కుల మల్లేశం మాట్లాడుతూ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దానికి సంబంధించిన విధి విధానాల కోసం అధికారులతో వేసే కమిటీలో యూనియన్‌ నాయకులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు ట్రెజరీల ద్వారా వేతనాలు అందించే విధంగా కృషి చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ అమలు చేయడంతో పాటు డీఏ బకాయిలను విడుదల చేయాలన్నారు. వెల్ఫేర్‌ కమిటీలను రద్దు చేసి కార్మిక సంఘాలను అనుమతించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించామన్నారు. తమ వినతికి రాష్ట్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:55 PM