Share News

జాతీయ రహదారి నిర్మాణ భూసేకరణపై సమీక్ష

ABN , Publish Date - May 19 , 2024 | 12:25 AM

మంథని డివిజన్‌లో జాతీయ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిపై తన కార్యాలయంలో మంథని ఆర్డీవో శనివారం ప్రత్యేకంగా సమీక్షించారు.

జాతీయ రహదారి నిర్మాణ భూసేకరణపై సమీక్ష

మంథని, మే 18: మంథని డివిజన్‌లో జాతీయ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిపై తన కార్యాలయంలో మంథని ఆర్డీవో శనివారం ప్రత్యేకంగా సమీక్షించారు. జాతీయ రహదారి భూసేకరణ పెండింగ్‌ పనులు, భూ సేకరణలో కోల్పోతున్న కట్టడాలు, బోర్లు, బావులు, పైపులైన్‌ల అంచనా విలువలను త్వరితగతిన అందించాలని సంబంధిత ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు, భూమికి సంబంధించిన పెండింగ్‌ పనులపై సంబంధిత తహసీల్దార్‌లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు రాజయ్య, రాంచందర్‌, సుమన్‌, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, ఆర్‌ఐలు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొనారు.

Updated Date - May 19 , 2024 | 12:25 AM