Share News

దివ్యాంగుల జాబ్‌మేళాకు స్పందన

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:48 PM

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధల శాఖ, యూత్‌ ఫర్‌ జాబ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల జాబ్‌మేళాకు స్పందన లభించింది.

దివ్యాంగుల జాబ్‌మేళాకు స్పందన
దివ్యాంగుల జాబ్‌మేళాను సందర్శించి ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధల శాఖ, యూత్‌ ఫర్‌ జాబ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల జాబ్‌మేళాకు స్పందన లభించింది. 17 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. 348 మంది దివ్యాంగులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 102 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జాబ్‌మేళాను కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించి కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఉద్యోగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపిక విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, జిల్లా సంక్షేమాధికారి సబిత, యూత్‌ జాబ్స్‌ కోఆర్డినేటర్స్‌ మధుసూదన్‌, షాహిద్‌, జడ్పీప సీఈవో శ్రీనివాస్‌, ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు, వారధి సెక్రెటరీ ఆంజనేయులు, సీడీపీవోలు కస్తూరి, సుగుణ, శ్రీమతి, ఎఫ్‌ఆర్వో రఫీ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:48 PM