Share News

వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో మరమ్మతులు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:27 AM

వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని అయా పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమితో కలిసి నీటిపారుదల, పంచాయతీరాజ్‌, అర్‌అండ్‌బీ, మున్సిపల్‌, పీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, ప్యాకేజీ 9, ఈఈలతో సమీక్ష నిర్వహించారు.

వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో మరమ్మతులు
ఆదర్శ కమిటీలపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- అమ్మ అదర్శ పాఠశాలల అమలుపై సమీక్ష

సిరిసిల్ల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని అయా పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమితో కలిసి నీటిపారుదల, పంచాయతీరాజ్‌, అర్‌అండ్‌బీ, మున్సిపల్‌, పీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, ప్యాకేజీ 9, ఈఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 510 పాఠశాలలు ఉండగా 309 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీల ఆధ్వర్యంలో స్కూళ్లలో తాగునీరు, తరగతి గదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించి కమిటీల ఆధ్వర్యంలో మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించారు. జాతీయ బ్యాంకులలో కమిటీల ఖాతాలు తెరిపించాలని అన్నారు. సమావేశంలో టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ అనితాసింగనాథ్‌, డీఈవో రమేష్‌కుమార్‌, పీఆర్‌ ఈఈ సూర్యప్రకాష్‌, డీఆర్‌డీవో శేషాద్రి, ఇరిగేషన్‌ ఈఈ అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:27 AM