క్వార్టర్ల తొలగింపు సహేతుకం కాదు..
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:45 AM
గోదావరిఖని శివాజీనగర్, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లోని క్వార్టర్ల తొలగింపు సహేతుకంగా లేదని, రోడ్డు వెడల్పు పేర 82క్వార్టర్లను కూల్చివేయడం వెనుక కుట్ర ఉన్నదని పలువురు అభిప్రా యపడ్డారు.

గోదావరిఖని, జూలై 7: గోదావరిఖని శివాజీనగర్, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లోని క్వార్టర్ల తొలగింపు సహేతుకంగా లేదని, రోడ్డు వెడల్పు పేర 82క్వార్టర్లను కూల్చివేయడం వెనుక కుట్ర ఉన్నదని పలువురు అభిప్రా యపడ్డారు. ఈఅంశంపై బాధితులు ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధికి తామెవరం వ్యతిరేకులం కాదని, అయితే రోడ్డు వెడల్పు కోసం ఒకే వైపు 150ఫీట్ల మేర సింగరేణి క్వార్టర్లను కూల్చివేసి అందులో నివసిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం హేతుబద్ధంగా లేదని పలువురు అభిప్రాయ పడ్డారు. మొదటి లైన్ తీసివేస్తే రోడ్డు కోసం 50ఫీట్ల మేర స్థలం ఏర్పడుతుందన్నారు. మిగి లిన రెండు లైన్లలోని 70క్వార్టర్ల తొలగింపు ప్రతిపాదనను విరమించుకో వాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేశారు. రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్, ఆజీ-1 జీఎం శ్రీనివాస్ తమ నిర్ణయాన్ని సమీక్షిం చుకోవాల్సి ఉన్నదని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. క్వార్టర్ల తొలగింపు అంశంపై చివరి దాకా అన్ని పక్షాలను కలుపుకుని పోరాటాలు కొనసాగిస్తామని తీర్మానించారు. ఈ అంశంపై 82క్వార్టర్లలో నివసిస్తున్న కార్మికులు ఇప్పటికే అనేక నిరసనలు, పోరాటాలు నిర్వహించారు. కోర్టును ఆశ్రయించారు. ప్రజా భవన్, సింగరేణి భవన్ ముందు కూడా హైదరాబాద్‌లో నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల సందర్భంలో ప్రభుత్వం, సింగరే ణి అధికారులు స్పందించిన తీరును కూడా రౌండ్ టేబుల్ సమావే శంలో చర్చించారు. గోదావరిఖని పట్టణం పూర్తిగా మైనింగ్‌తో కూడు కున్నదని, మైనింగ్ కార్యక్రమాలు ముగిస్తే ఈ ప్రాంత ఉనికే ప్రశ్నా ర్థంగా మారుతుందని పలువురు అన్నారు. ఇప్పటికే ఓసీపీ వల్ల ఇక్క డి నివాసాల్లో ఉంటున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పట్టణీకరణ విషయంలో ఈ అంశాలన్నీంటిని పరిగణలోకి తీసుకుని పరి మితమైన అభివృద్ధి ప్రణాళికలు ప్రజల అవసరాల మేరకు చేపట్టాలని, పలు రాజకీయ పక్షాల నాయకులు పేర్కొన్నారు. క్వార్టర్ల బాధితుల పక్షాన నాయకత్వం వహిస్తున్న తోట వేణు అధ్యక్ష తన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీనర్సయ్య, టీడీపీ నాయకులు వీరేందర్, స్నేహసాహితి బాధ్యులు ఏ లేశ్వరం వెంకటేశ్వర్లు, హ్యుమన్ రైట్స్ ప్రతినిధి కిరణ్‌జీ, న్యూ ఇండియా పార్టీ నాయకుడు వేముల అశోక్, ఎంఆర్‌పీఎస్ నాయకుడు ఉప్పులేటి పర్వతాలు,అడ్వకేట్ జేఏసీ నాయకుడు పులిపాక రాజ్‌కుమార్, మాల మ హానాడు నాయకుడు శ్రీహరి, రాజేశ్వర్‌రావు, శేఖర్‌తో పాటు బాధిత సిం గరేణి కుటుంబాల సభ్యులు పాలొన్నారు.