Share News

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో తగ్గిన నేరాలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:41 AM

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని సీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో తగ్గిన నేరాలు

కోల్‌సిటీ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని సీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి, మంచి ర్యాల జిల్లాల్లో పటిష్టమైన పోలీసింగే ఇందుకు కారణమ న్నారు. సోమవారం కమిషనరేట్‌లో ఆయన వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మా ట్లాడుతూ కమిషనరేట్‌లో 2023తో పోల్చితే నమోదైన కేసు సంఖ్య 1257తగ్గిందన్నారు. గత ఏడాది 9424ఉంటే, ఈ ఏడాది 8167గా ఉందన్నారు. అలాగే హత్యలు కూడా 46 నుంచి 33కు తగ్గాయన్నారు. చీటింగ్‌ కేసులు కూడా 743 నుంచి 594కు తగ్గినట్టు పేర్కొన్నారు. దోపిడీ, దొంగ తనాలు కూడా అదుపులోకి వచ్చాయని, పోలీస్‌ పెట్రో లింగ్‌లు,రాత్రిపూట గస్తీ, సత్ఫలితాలనిచ్చిందన్నారు. కమి షనరేట్‌ పరిధిలో వివిధ కేసుల్లో గత ఏడాది రూ.4.16 కోట్లు ప్రాపర్టీ పోగా ఈ ఏడాది 5.82కోట్ల ప్రాపర్టీ పో యిందన్నారు. కానీ రికవరీ మాత్రం 10శాతం పెరిగింద న్నారు. గత ఏడాది 23శాతం ఉంటే ఈ ఏడాది 33.39 శాతంగా ఉందన్నారు. కమిషనరేట్‌లో ఈ చలాన్‌కు సం బంధించి 5,05,636కేసులు నమోదు అయితే రూ.12.23 కోట్లు జరిమానా విధించామన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌కు సం బంధించి 12779కేసులు నమోదు అయితే రూ.76.99లక్ష లు జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, తనిఖీల వల్ల రోడ్డు సేఫ్టీ పెరిగిందని, దీని వల్ల కమిషన రేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాల కేసులు కూడా తగ్గాయ న్నారు. 755రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 263 మంది మరణించారని, 810మందికి గాయాలయ్యాయ న్నారు. గ్యాంబ్లింగ్‌కు సంబంధించి 928మందిపై కేసులు నమోదు రూ.77.25లక్షలు సీజ్‌ చేశామన్నారు. గంజాయి కి సంబంధించి 237మందిపై కేసులు నమోదు 51.23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీ సీడ్స్‌కు సంబంధించి ఉక్కుపాదం మోపామని, కర్ణాటక వరకు వెళ్లి రవాణాదారులపై నిఘా పెట్టి పట్టుకున్నామ న్నారు. కమిషనరేట్‌లో ఆపరేషన్‌ గరుడ సత్ఫలితాలని స్తుందని, దీనిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అభి నందించారన్నారు. పెద్దపల్లి పర్యటనకు వచ్చిన ముఖ్య మంత్రి కమిషనరేట్‌ అంతా విస్తరింపచేయాలని, అందు కు నిధులు ఇప్పిస్తామని చెప్పారన్నారు. ఈ గరుడ ఆప రేషన్‌లో పోలీసులకంటే ముందే గొడవలు జరిగే ప్రాంతా లకు డ్రోన్లు వెళతాయని, అక్కడి పరిస్థితులను చిత్రీకరి స్తాయన్నారు. తద్వారా నేరాల నియంత్రణ కూడా సాధ్య మవుతాయన్నారు. అలాగే మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు కూడా డ్రోన్‌ పెట్రోలింగ్‌ నిర్వహించామని, ఫలితాలను సాధించామన్నారు. పది పోలీస్‌ స్టేషన్ల పరి ధిలో ఈ డ్రోన్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. గం జాయి నియంత్రణకు నిరంతర నిఘా కొనసాగుతుందని, పాత నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నా మన్నారు. కమిషనరేట్‌ పరిధిలో పార్లమెంట్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, ఎన్నికల సందర్భంగా రూ.1.79కోట్ల సొమ్మును సీజ్‌ చేశామన్నారు. కమిషనరేట్‌ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిం చామని, 116ఘటనల్లో 255మందిపై కేసులు నమోదు చేసి 182వాహనాలను సీజ్‌ చేశామని, రూ.17.78లక్షల విలువైన ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. కమి షనరేట్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 208 మందిపై హిస్టరీ షీట్లు తెరిచామని, అందులో 50మంది పై రౌడీషీట్లు, 158మందిపై సస్పెక్ట్‌ షీట్లు తెరిచామన్నా రు. పీడీ యాక్టు నిబంధనలు కఠినతరం కావడం వల్ల ఒకరిపై మాత్రమే పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీకి సంబంధించి 140కేసులు నమోదు కాగా 102కేసుల్లో చార్జిషీట్లు వేసి రూ.12.75లక్షలు నష్టపరిహా రం ఇప్పించామన్నారు. లోక్‌ అదాలత్‌లో 42762పీటీ, కాంపౌండబుల్‌ కేసులను పరిష్కరించామన్నారు. సీసీ కెమెరాలకు సంబంధించి ప్రజలు, ప్రభుత్వ శాఖలు సమ న్వయంతోనే నిర్వహణ సాధ్యమవుతుందన్నారు. ముఖ్యం గా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ఉన్న పట్ట ణాల్లో నిర్వహణ స్థానిక సంస్థలే చేపట్టాల్సి ఉందని, ఈ మేరకు లేఖలు రాశామన్నారు.

అవగాహనతోనే సైబర్‌ నేరాల నియంత్రణ

ప్రజల్లో సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా సైబర్‌ నేరస్థుల బారిన పడకుండా నియంత్రించు కోవచ్చని సీపీ తెలిపారు. సెల్‌ఫోన్‌ వినియోగాల్లో జాగ్ర త్తలు వహించాలన్నారు.సాధ్యమైనంత వరకు ప్రజలు తమ బ్యాంకు అకౌంట్లలో పెద్ద ఎత్తున నిల్వలు ఉంచుకో వద్దని, అవసరమైన మేర ఉంచుకొని మిగతాది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసుకోవాలన్నారు. గత ఏడాది సైబర్‌ క్రైమ్‌కు సంబంధించి 281కేసులు నమోదయ్యాయని, రూ.5.02 కోట్లు ప్రజలు నష్టపోయారన్నారు.

33శాతం కేసుల్లో శిక్షలు

రామగుండం కమిషనరేట్‌ పరిధిలో కేసులు నమోదు చేయడంతో పాటు నేరస్థులకు శిక్షలు వేయించడంలో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. 36శాతం కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షల రేటు 33శాతం ఉంటే కమిషనరేట్‌లో 36శాతం ఉందన్నారు. ఈఏడాది ముగ్గురికి యావజ్జీవ శిక్షలు పడ గా ఆరుగురికి పదేళ్లు, ఐదుగురికి ఐదు సంవత్సరాలు, నాలుగేళ్లు ఒకరికి, రెండేళ్లు 11మందికి పడ్డాయన్నారు. ఏడాదిలోపు శిక్షలు పడ్డవారు 35మంది ఉన్నారన్నారు. విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచి ర్యాల డీసీపీ భాస్కర్‌, అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహు లు, ఏఆర్‌ ఏసీపీలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:41 AM