Share News

ప్రభుత్వంపై పోరాటానికి సిద్దం

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:32 AM

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సాదించుకోవడానికి ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల ఆత్మాభిమానం నిలుపుకోవడానికి ఉద్యమ కార్యచరణకు సిద్దమని కరీంనగర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ పిలుపునిచ్చింది. ఆదివారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మెన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశంలో భాగస్వామ్య సంఘాలు పాల్గొన్నాయి.

ప్రభుత్వంపై పోరాటానికి సిద్దం
సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి

సుభాష్‌నగర్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సాదించుకోవడానికి ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల ఆత్మాభిమానం నిలుపుకోవడానికి ఉద్యమ కార్యచరణకు సిద్దమని కరీంనగర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ పిలుపునిచ్చింది. ఆదివారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మెన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశంలో భాగస్వామ్య సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రతినెల మొదటి తారీఖున జీతలు ఇస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాద్యాయలు, పెన్షనర్లు ప్రభుత్వంలో భాగమన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడంలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హక్కుగా రావలసిన కనీస చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని, తమది ప్రజా ప్రభుత్వమని పేర్కొంటూ ఈ రోజు వరకు జేఏసీ నాయకులను చర్చలకు పిలవకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వాల బాద్యత అని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు మంజూరు చేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు భరోసా కల్పించే హెల్త్‌స్కీం, ఇతర డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం వెంటనే నష్ట నివారణకు చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర జేఏసీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని, పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కట్ట రవీంద్రాచారి, పీఆర్‌ శ్రీనివాస్‌, కరుణాకర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, తూముల తిరుపతి, నరహరి, గోనె శ్రీనివాస్‌, ముల్కల కుమార్‌, ఆదర్శన్‌రెడ్డి, ఎంఏ ఖాద్రి, ఖాజ మంజూర్‌అలీ, కరుణాకర్‌, చంధ్రశేఖర్‌, వెలిచాల వెంకటస్వామి, పాతూరి రాజిరెడ్డి, ఎం రామ్మోహన్‌, కోట రామస్వామి, వెంకన్న, నర్సయ్య, ఎంఏ హమీద్‌, పి కేశవరెడ్డి, సురేందర్‌రెడ్డి, శశిధర్‌శర్మ, శారద, లలితమేరి, మహేందర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌, ప్రభాకర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్‌, నాగరాజు, కిరణ్‌కుమార్‌, రమేశ్‌, సునీత, సరిత, విజయలక్ష్మి, సుష్మిత, స్వరూప, ఏవి రాజేశ్వర్‌రావు, సర్దార్‌ హర్మిందర్‌సింగ్‌, సుమంత్‌రావు, కొండయ్య, పి కిషన్‌, నాగరాజు, జలాలుద్దీర్‌అక్బర్‌, బల్బీర్‌సింగ్‌, లవకుమార్‌, కరుణాకర్‌, కమలాకర్‌, అజ్గర్‌, నర్సయ్య, అభిషేక్‌, గిరిధర్‌రావు, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:32 AM