Share News

టీజీవో జిల్లా అధ్యక్షుడిగా రవీందర్‌ ఎన్నిక

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:36 AM

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా కార్యవర్గా న్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

టీజీవో జిల్లా అధ్యక్షుడిగా రవీందర్‌ ఎన్నిక

పెద్దపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా కార్యవర్గా న్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కమ్యూ నిటీ హాల్‌లో జరిగిన ఎన్నికలో మంథని అర్‌డీవో కార్యాలయ పరిపాలన అధికారి తూమ్‌ రవీందర్‌ మ రోసారి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అసోసియే ట్‌ అధ్యక్షురాలిగా మండల వ్యవసాయ శాఖాధికారి అలివేణి, ఉపాధ్యక్షులుగా కుమార్‌, సాజిద్‌అలీ, అంజ లి, కార్యదర్శిగా బ్రహ్మేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శు లుగా గొడిశాల శ్రీనివాస్‌, మధు, అనుషా, కోశాధికా రిగా కరుణాకర్‌, నిర్వహణ, ప్రచార, కార్యాలయ, సాంస్కృతిక, క్రీడల కార్యదర్శులుగా సురేష్‌, శ్రీకాంత్‌, శంకర్‌, తిరుమల్‌, మధుబాబు, సభ్యులుగా గంగాప్ర ణవ్‌, సతీష్‌, సింధూరి రాఘవేంద్ర చారిని ఎన్నుకు న్నారు. ఎన్నికల అధికారిగా శ్రీరామ్‌రెడ్డి, సహాయ అధి కారిగా రామారావులు వ్యవహరించారు.

ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి

- రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌

ఉద్యోగుల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలోని సుమారు పది లక్షల మంది ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నార న్నారు. అందరి ప్రయోజనాల కోస మే తాము కృషిచేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా సంఘం ఏకగ్రీవం గా ఎన్నికకావడం అభినందనీయం అన్నారు. రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన రవీందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయ ణ, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్యామ్‌, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, విష్ణు, టీఎన్‌జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు బొంకూ రి శంకర్‌, మామిడి రమేష్‌, సమర్‌ సేన్‌, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:36 AM