Share News

రామాయణం లోకానికి దిక్సూచి

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:35 AM

రామాయణం లోకానికి దిక్సూచి వంటిదని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయరుస్వామి అన్నారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌ పద్మనాయక కల్యాణ మండపంలో ఆయన మంగళవారం ఉదయం, సాయంత్రం ప్రవచనం చేశారు.

రామాయణం లోకానికి దిక్సూచి

కరీంనగర్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 16: రామాయణం లోకానికి దిక్సూచి వంటిదని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయరుస్వామి అన్నారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌ పద్మనాయక కల్యాణ మండపంలో ఆయన మంగళవారం ఉదయం, సాయంత్రం ప్రవచనం చేశారు. త్రేతాయుగ పురుషుడైన రాముడు నారాయణుడి అంశతో మానవుడిగా జన్మించి లోక నీతిని, రీతిని తెలియజెప్పాడన్నారు. రామాయణాన్ని చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయని, వాటిని ఆచరించాలని సూచించారు. రామాయణం వినడం, పారాయణం చేయంచుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు. ఉదయం శ్రీమద్రామాయణ హవనం, పూర్ణాహుతి, మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో చల్మెడ లక్ష్మీనరసింహరావు, కె గౌతమరావు, బీవీ రావు, ఎస్‌ వెంకటేశం, ఎల్‌ భూపతిరావు, యాద కిషన్‌, కె వరప్రసాదాచార్యులు పాల్గొన్నారు.

ఫ నేడు సీతారామ కల్యాణం.... పట్టాభిషేకం...

బుధవారం ఉదయం 10 గంటల నుంచి సీతారామ కల్యాణ మహోత్సవం, శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం చిన్న జీయరుస్వామి సమక్షంలో జరుగనున్నాయి. ఇందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు పాల్గొని తరించాలని కోరారు.

Updated Date - Apr 17 , 2024 | 12:35 AM