Share News

రాజన్న హుండీ ఆదాయం రూ.2 కోట్ల 21 లక్షలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:37 AM

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.2 కోట్ల 21 లక్షలకుపై ఆదాయం సమకూరింది.

రాజన్న హుండీ ఆదాయం రూ.2 కోట్ల 21 లక్షలు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది

వేములవాడ, మార్చి 26 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.2 కోట్ల 21 లక్షలకుపై ఆదాయం సమకూరింది. 21 రోజుల వ్యవధిలో భక్తులు స్వామవారి హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో లెక్కించారు. ఈ సందర్భంగా 2 కోట్ల 21 లక్షల 29 వేల 350 రూపాయల నగదు, 463 గ్రాముల బంగారం, 19 కిలోల 800 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది రాజరాజేశ్వరసేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:38 AM