Share News

రామగుండం మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:46 PM

రామగుండం మెడికల్‌ కళాశాల ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది.

రామగుండం మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌

కళ్యాణ్‌నగర్‌, ఫిబ్రవరి 13: రామగుండం మెడికల్‌ కళాశాల ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. సోమవారం రాత్రి సీనియర్‌ విద్యార్థులు ఇద్దరు జూనియర్‌ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డా రు. కళాశాలలోని హాస్టల్‌లో మెడికల్‌ మొదటి సంవత్సరం చదు వుతున్న ఇద్దరు జూనియర్‌ విద్యార్థులను వేధిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఇద్దరి విద్యార్థుల తల వెంట్రుకలు ఎందుకు పెంచు తున్నావంటూ ట్రిమ్మర్‌తో గుండు చేసి, మీసాలు తొలగించారు. హాస్టల్‌లో మూకుమ్మడిగా సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యా ర్థుల గదుల్లోకి చొరబడి వీరితో పాటు మరో ముగ్గురిని కూడా ర్యాగింగ్‌ చేశారు. ఈ సంఘటనపై విద్యార్థులు తమ తల్లిదండ్రు లకు సమాచారం ఇచ్చారు. ర్యాగింగ్‌తో భయంతో ఇద్దరు విద్యా ర్థులు తమ ఇండ్లకు వెళ్లిపోయారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యా ర్థులపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం జూనియర్‌ విద్యార్థులు వైస్‌ ప్రిన్సిపాల్‌ చాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సీనియర్లు జూనియర్లను పలు విషయాల్లో వేధింపులకు గురి చేస్తున్నా రని ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్‌ విద్యార్థులను తాము ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటామని, వారిని సార్‌, మేడం అని పిలిచినప్పటికీ తమను ర్యాగింగ్‌ చేయడం సరికాదన్నారు. విషయం తెలుసుకున్న గోదావరిఖని వన్‌టౌన్‌ ఎస్‌ఐ శరణ్య కళాశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత విద్యార్థులు ప్రిన్సిపాల్‌ హిమబిందుకు ఫిర్యాదు చేశారు. కళాశాలలో ర్యాగింగ్‌ భూతాన్ని తరమిరికొట్టాలని జూ నియర్‌ విద్యార్థులు నిరసనకు దిగారు. తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని వన్‌టౌన్‌ సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం...

మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు

ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై జూనియర్‌ విద్యార్థులు ఫిర్యాదు చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారిపై క్రమశి క్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్‌ హిమబిందు పేర్కొన్నారు. ర్యా గింగ్‌పై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:46 PM