Share News

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:15 AM

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని డీఈవో మాధవి అన్నా రు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 7: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని డీఈవో మాధవి అన్నా రు. మండల కేంద్రంలో శుక్రవారం ప్రొఫెసర్‌ జయ శంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి ఈడు పిల్లలు ఉన్న ఇండ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని కరపత్రాల ద్వారా డీఈవో మాధవి వివరించారు. ఫ్లెక్సీలతో గ్రామవీధుల్లో ఊరే గింపు నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులకు కరప త్రాలు అందిస్తూ ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వివ రించారు. అనంతరం ఎస్‌సీ కాలనీ ఆంగ్ల మాద్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలల్లో అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకుల చేత శాస్త్రీయ విద్యా విధానంలో బోధన చేయిస్తున్నామని, బడి ఈడు కలిగిన పిల్లల్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో కోరారు. పిల్లల తల్లిదండ్రులు పైవ్రేట్‌ పాఠశాలలపై మోజు వీడాలని, ఫీజుల రూపంలో చెల్లించే డబ్బును పిల్లల పేరు మీద ఫిక్స్‌ డిపాజిట్‌ చేసుకోవాలని సూచించా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని, దానికి ఉదాహరణ తామేన న్నారు. అన్ని హంగులతో ఉన్న అంగన్‌వాడీ కేంద్రా లు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి, ఉచితం గా నాణ్యమైన విద్యా సౌకర్యాలను పొందాలని పిల్లల తల్లిదండ్రుల్ని డీఈవో కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌ యాదవ్‌, జడ్‌పీటీసీ వంగ ల తిరుపతిరెడ్డి, ఎంపీడీవో రామ్మోహనచారి ఎంపీవో గోవర్ధన్‌, ఎంఈవో సురేందర్‌ కుమార్‌, ఎంఎన్‌వో సిరిమల్ల మహేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 12:15 AM