Share News

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:36 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్భందీగా నిర్వ హించాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ అన్నారు.

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

సుల్తానాబాద్‌, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్భందీగా నిర్వ హించాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ అన్నారు. సుల్తానాబాద్‌ సహకార సంఘం నూతన సమావేశ మందిరంలో ఏర్పాటు శనివా రం సుల్తానాబాద్‌ సర్కిల్‌పరిధిలో ధాన్యం కొను గోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో, కేంద్రా ల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్‌ ప్రాంతంలో వరి కోతలు ముందు గానే ప్రారంభించిన నేపథ్యం లో కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. సర్కిల్‌ పరిధిలోని 8 సహకార సంఘాల పరిధిలో మొత్తం 57 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌలభ్యం కోసం హమాలీల కోసం టెంట్లు వేయించాలని, త్రాగునీటి వసతి కల్పిం చాలని, కుర్చీలు ఉంచాలని సూచించారు. రైతు లకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అఽధి కారి శ్రీమాల, తహసీల్దార్‌ మధుసూధన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సహకార సొసైటీల ఉద్యోగులు సిబ్బందితో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:36 AM