Share News

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:40 AM

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలం సనుగుల, దేవునితండా గ్రామాల్లో మంగళవారం కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు.

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
కృతజ్ఞతా ర్యాలీలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి, జనవరి 16: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలం సనుగుల, దేవునితండా గ్రామాల్లో మంగళవారం కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి సనుగులకు వచ్చిన ఆది శ్రీనివాస్‌కు ప్రజలు, కాంగ్రెస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చామన్నారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు అమలు చేశామన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేస్తామన్నారు. ఇటీవల మృతి చెందిన దేవుని తండా సర్పంచ్‌ భూక్య పంతులు నాయక్‌, గంగాధర రామస్వామి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో జడ్సీటీసీ నాగం కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు భీమరాజు కనకరాజు, ముస్కు ముకుంద రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:40 AM