Share News

అధ్వానంగా ప్రభుత్వ పాఠశాల

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:50 PM

మండలంలోని ఖాసింపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అధ్వానంగా మారింది. అధికారుల పట్టింపు కరువై శిధిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

                అధ్వానంగా ప్రభుత్వ పాఠశాల

గన్నేరువరం, జనవరి 12: మండలంలోని ఖాసింపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అధ్వానంగా మారింది. అధికారుల పట్టింపు కరువై శిధిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతి గదులకు కిటికీలు లేవు. పాఠశాలకు చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడంతో రాత్రి వేళలో మందుబాబులు అడ్డాగా చేసుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో మద్యాన్ని సేవించి సీసాలను పగులగొట్టి తరగతి గదుల్లో పడేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని పాఠశాలకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- పాఠశాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి

- గడ్డం సుమిత్‌ రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఖాసింపేట

మా గ్రామంలోని పాఠశాల అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్షంతో అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారైంది. తరగతి గదుల్లో మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. పాఠశాలకు మరమ్మతులు చేపట్టి, ప్రహరీ నిర్మించాలని పలుమార్లు గ్రామపంచాయితి పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు పాఠశాల మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jan 12 , 2024 | 11:50 PM