ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా విధులు..
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:30 AM
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలని రామగుండం సీపీ శ్రీని వాస్ అన్నారు.
కోల్‌సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలని రామగుండం సీపీ శ్రీని వాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధికి ఎంపికైన నూతన ఆర్ముడ్ కానిస్టేబుల్స్‌కు రామగుండం కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హాజరై సిబ్బంది స్కాడ్ డ్రిల్, పరేడ్, మాబ్ ఆపరేషన్ డ్రిల్, స్పెషల్ పార్టీ విధులు, కూంబింగ్ విధులు, వివిధ బందోబస్త్‌లలో రోప్‌పార్టీ విధులు, చేయవలసిన విధులు, చేయకూడని విధుల గురించి, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను గురించి సూచనలు చేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాల న్నారు. చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి భద్రత ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించాలన్నారు. శాంతి భద్రతల సంర క్షణకు, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా క్యూఆర్‌టీ, స్పెషల్ పార్టీ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. క్యూఆర్‌టీ బలగాలను విస్తృతం గా వినియోగించి లా ఆర్డర్ నిర్వహించడంలో, ఏదైనా నిరసనలకు వెంటనే స్పందించడంలో, కీలక సమయంలో పౌరుల భద్రతను నిర్ధా రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఏదైనా అత్య వసర పరిస్థితి, చట్టవిరుద్ధ కార్యకలాపాలు సంభవిస్తే వెంటనే స్పందిం చేందుకు క్యూఆర్‌టీ బృందాలు వ్యూహాత్మకంగా నివారించడానికి విధు లు నిర్వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు, ఏఆర్ ఏసీపీ సుందర్‌రావు, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, సంపత్, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.