Share News

నిర్దేశిత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:08 AM

వివిధ సమస్యలపై ప్రభుత్వ కార్యాలయా ల్లో ప్రజలు సమర్పించే దరఖాస్తులను నిర్దేశిత సమయంలోగా అధి కారులు పరిష్కరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఆదేశించారు.

నిర్దేశిత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి

మంథని, ఫిబ్రవరి 19: వివిధ సమస్యలపై ప్రభుత్వ కార్యాలయా ల్లో ప్రజలు సమర్పించే దరఖాస్తులను నిర్దేశిత సమయంలోగా అధి కారులు పరిష్కరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఆదేశించారు. సోమవారం మంథని తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ప్రజల అర్జీలను స్వీకరించారు. అంతకుముందు మంథని డివిజన్‌ అధికారులతో కలె క్టర్‌ మాట్లాడుతూ.. మంథని పట్టణంలో నూతన బస్తీ దవాఖానాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ వోకు సూచించారు. మంథని డివిజన్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్‌లను నిరంతరం తనిఖీ చేస్తూ వైద్యాధికారు లు, గైనకాలజిస్ట్‌, ఇతర సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహించే లా పర్యవేక్షించాలన్నారు. డివిజన్‌ పరిధిలో జరుగుతున్న ప్రసవాల పై సమగ్ర నివేదిక తయారుచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రి, పైవ్రేట్‌ ఆసుపత్రులలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌ ఆప రేషన్ల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించి, సిజెరియన్‌ ఆపరేషన్‌ లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసు పత్రిలో గైనకాలజిస్ట్‌ ఖాళీలుంటే భర్తీ చేయాలని, ఆసుపత్రిలో రోగు లు మందులు బయట కొనుక్కునే పరిస్థితి రాకుండా ఎప్పటికప్పు డు స్టాక్‌ పర్యవేక్షించాలన్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సర ఫరా ప్రధాన కర్తవ్యంగా గ్రామపంచాయతీలు, మంథని మున్సిపా లిటీ పని చేయాలన్నారు. మంథని డివిజన్‌ వ్యాప్తంగా వాటర్‌ ఆడి ట్‌ నిర్వహించాలని, ప్రతి గ్రామం వారీగా విద్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా స్థితి గతులపై నివేదిక తయారు చేసుకోవాలని, గ్రిడ్‌, ఇంట్రా నీటి సరఫరా వివరాలు పరిశీలించాలని, రాబోయే వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. మంథని పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ముందస్తుగా అవసరమైన మేర డంప్‌ షెడ్స్‌ తయారు చేయాలని, పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని అవసరమైన మేర చెత్త సేకరించే ఆటోలను ప్రోక్యూర్‌ చేయాలని, ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరణ నిర్వహణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంథని డివిజన్‌ వ్యాప్తంగా ఉన్న ఇటుక బట్టిల ను తనిఖీ చేసి అక్కడ కార్మికులకు ఉన్న పరిస్థితులు, కార్మికులకు కల్పించిన వసతులు, వారి జీవన విధానం, వివిధ అంశాలపై సం పూర్ణ నివేదిక శుక్రవారంలోగా అందించాలని అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీ సర్‌ను ఆదేశించారు. ఎస్సారెస్పీ నీటి విడుదల టేల్యాండ్‌ వరకు చేరే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, కాలువలో అందుబా టులో ఉన్న నీరు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ చివరిఆయ కట్టు వరకు సాగునీరు అందించాలని, సాగు నీటి విడుదల సంబం ధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు రైతులకు అందించాలన్నారు. ఈకార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్‌ అధికారి హనుమా నాయక్‌, తహసీల్దార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:08 AM