Share News

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:33 AM

ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్‌ప్రసాద్‌లాల్‌తో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
దరఖాస్తుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

- కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

పెద్దపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్‌ప్రసాద్‌లాల్‌తో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఓదెల మండలం కొలనూర్‌ గ్రామానికి చెందిన తోట సంతోష్‌ తాను దివ్యాంగుడినని తనకు సదరం సర్టిఫికెట్‌ వచ్చినప్పటికీ పెన్షన్‌ రావడంలేదని దివ్యాంగుల పెన్షన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పెద్దపల్లి పట్టణం జ్యోతినగర్‌కు చెందిన నూతి రామస్వామి తన కుమారుడు ఆస్తి పంప కం చేయమని ఇంటికి వచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తనకు, తన భార్యకు రక్షణ కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌ అధికారికి రాస్తూ సీనియర్‌ సిటిజన్‌ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మా ట్లాడారు. కలెక్టరేట్‌లో విధులకు హాజరయ్యే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమ యపాలన పాటించాలని, సకాలంలో కార్యాలయ విధులకు హాజరుకావాలని కలెక్టర్‌ సూచించారు. కార్యాలయ పనివేళల్లో జిల్లా అధికారులు క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లే పక్షంలో కార్యాలయంలో బాధ్యతగల మరో అధికారి అందుబా టులో ఉండేలా చూసుకోవాలన్నారు. వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో కార్యాలయ సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని కలెక్టర్‌ సూచిం చారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో సీహెచ్‌ మధుమోహన్‌, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:33 AM