బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
ABN , First Publish Date - 2024-02-06T01:01:51+05:30 IST
బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ప్రజాత్రినిధులు, నాయకులు, కార్యకర్తల నిరసనలు వెల్లువెత్తాయి.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 5: బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ప్రజాత్రినిధులు, నాయకులు, కార్యకర్తల నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా, పట్టణ, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో చేపట్టారు. దీంతో సిరిసిల్ల పట్టణం నుంచి సిద్దిపే టకు వెళ్లే వాహనాలు అరగంట వరకు స్థంభించాయి. దీంతో పోలీసులు రోడ్డుపై భైఠాయించిన బీఆర్‌ఎస్ నాయకులను బలవంతంగా ఈడ్చివేసేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడానికి బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించగా డీఎస్పీ ఉధయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపాలాటతో ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ఒకవైపు పోలీసులు దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకుంటుండగా మరో వైపు బీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో లను దహనం చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్.. కేటీఆర్ అడ్డా సిరిసిల్ల గడ్డా అంటూ నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లా డుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి భాషా మాట్లాడాలో తెలయని నిజమైన రండా రేవంత్‌రెడ్డే అన్నారు. ఆర్‌ఆర్ అంటే ఎవరో తెలంగాణ ప్రజలందరికి తెలుసని వ్యగ్యంగా ఉదహరించారు. తెలంగాణ ప్రజల ఓట్ల కోసం అమలుగానీ హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద 420 అని ఆరోపించారు. ఎమ్మెల్సీకి డబ్బుల సంచులివ్వజూసి అడ్డంగా దొరికిపోయిన 420 రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అసహనం, అహంకారంతో మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు. ముఖ్యమంత్రి భాషా ఇలానే ఉంటే భవిష్యత్‌లో ప్రజల చేత పరాభావం తప్పదని హెచ్చరించారు. జాతీయ కాంగ్రెస్ మెడలు వంచే టీఆర్‌ఎస్ తెలంగాణ తెచ్చిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంచేయలేక పోయిందని మేనేజ్ మెంట్ కోటాలో తెచ్చుకున్న ముఖ్య మంత్రివి నీవు ఏం చేయలేవని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ట్రంను దేశంలోనే అగ్రగామిగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలపారని అన్నారు. రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెన్నంటి ఉంటూ మీ నడ్డివిరుస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, ఎంపీపీలు, జడ్పిటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ జిల్లా, సిరిసిల్ల పట్టణం నాయకులు, సిరిసిల్ల నియోజక వర్గం పరిధిలోని వివిధ మండ లాల బీఆర్‌ఎఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు మాజీ సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కామారెడ్డి- సిద్దిపేట ప్రధాన రోడ్డుపై బైటాయించి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధ్యత మరిచి మాట్లాడిన తీరును ప్రజలు గమనిస్తున్నారని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు హైమద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దయాకర్‌రావు, మండల మహిళ నాయకురాలు సుతారి సంపూర్ణ, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.