Share News

పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:15 AM

లోక్‌సభ ఎన్నికలు నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు.

పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

పెద్దపల్లి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : లోక్‌సభ ఎన్నికలు నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, ఇతర ఉన్నతాధికారు లతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్ప నపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌లు జే.అరుణశ్రీ, జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌తో కలిసి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ పెండింగ్‌ ఓ టర్‌ నమోదు దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అన్నారు. రాబోయే లోక్‌ సభ ఎన్నికలలో ఓటర్‌ స్లిప్పులు ప్రతి ఓటరుకు చేరే లా చర్యలు తీసుకోవాలని, ముందస్తుగానే ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టాలని, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్‌పై పోటీ చేసే అభ్యర్థు లకు, రాజకీయ పార్టీలకు ముందస్తుగా సమాచారం అందించాలని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలు నియమిం చిన పోలింగ్‌ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బూత్‌స్థాయి అధికారులు ఓట ర్‌స్లిప్‌లు పంపిణీ చేసే సమయంలో పాల్గొనవచ్చని, ఓటరు స్లిప్పు ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎక్కడ కూడా అందలే దనే ఫిర్యాదులు రావద్దని అన్నారు. ఏప్రిల్‌ 18న రిటర్నింగ్‌ అధికా రులు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, అదేరోజు నుంచి ఏప్రిల్‌ 25 వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. నామినేషన్‌ స్వీకరణ, స్ర్కూటినీ, ఉపసంహరణ, పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, స్వతం త్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పేపర్‌ రూపకల్పన వంటి అంశాలను ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పక డ్బందీగా నిర్వహించాలని అన్నారు. నామినేషన్‌ స్వీకరణ నేపథ్యం లో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, పోటిచేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. నామినేషన్‌ దాఖలుకు ముందు ప్రీ వెరిఫికేష న్‌ డెస్క్‌ వద్ద పరిశీలించాలని అన్నారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాల యానికి సాధ్యమైనంత వరకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్‌ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ జరగాలని, రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, నామినేషన్ల స్వీకరణ పై ప్రతిరోజు నివేదికలను సమర్పించాలని, ప్రతి రోజూ దాఖలైన నామినేషన్‌ అభ్యర్థుల అఫిడవిట్‌లు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో న మోదు చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అధికారులతో మాట్లాడుతూ నామినేషన్లు దాఖలు సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థి ప్రతిజ్ఞ రిటర్నింగ్‌ అధికారి ముందు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి రోజు నమోదు అవుతున్న నామినేషన్లు సెట్ల వారీగా సమాచారం పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అభ్యర్థి ఫొటోసాఫ్ట్‌ కాపీ, హార్డ్‌కాపీ తీసుకోవాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరు గుతుందని, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. సమావే శంలో ఆర్డీవోలు హనుమానాయక్‌, బి.గంగయ్య, కలెక్టరేట్‌ పరిపాల న అధికారి శ్రీనివాస్‌ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, రామగుండం తహ సీల్దార్‌ కుమారస్వామి, సంబంధిత అధికారులు, డీటీఈ ప్రవీణ్‌, సి విభాగం సూపరింటెండెంట్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:15 AM