సమస్యలు పరిష్కరించాలి..
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:54 PM
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు.
సుభాష్‌నగర్, జూలై 15: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్) ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో గరిష్ఠ పరిమితిలేని నాణ్యమైన ఉచిత వైద్య చికిత్సలు అందించాలని, ప్రతి జిల్లాలో రెండు వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలు, మందులు, నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం ఐఆర్‌ను 20 శాతానికి పెంచాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని, ఈనెల 1 నుంచి మానిటరీ బెనిఫిట్ చెల్లిస్తూ అమలు చేయాలన్నారు. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీ యింబర్స్‌మెంట్ బిల్లులు, ఇతర బిల్లులను వెంటనే చెల్లించాలని, గత పీఆర్సీ రికమండ్ చేసిన 20 సంవత్సరాల సర్వీసుకు ఫుల్ పెన్షన్‌ను 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షనరీ బెనిఫిట్స్‌కు అనుమతించాలని కోరారు. సీవీపీ రికవరీలు 15 సంవత్సరాలు కాకుండా 12 సంవత్సరాలు పూర్తి కాగానే నిలిపివేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెన్షనర్లు కూడా పాల్గొన్నారని, పెన్షనర్లకు తెలంగాణ ప్రత్యేక ఇన్‌సెంటివ్‌ను ప్రకటించాలన్నారు.