Share News

వేతనాలు అందక నర్సింగ్‌ స్టాఫ్‌ ఇబ్బందులు

ABN , Publish Date - May 23 , 2024 | 12:32 AM

ప్రభుత్వం గత మార్చిలో కొత్తగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 250మంది నర్సింగ్‌ స్టాఫ్‌ను నియమించింది.

వేతనాలు అందక నర్సింగ్‌ స్టాఫ్‌ ఇబ్బందులు

కళ్యాణ్‌నగర్‌, మే 22: ప్రభుత్వం గత మార్చిలో కొత్తగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 250మంది నర్సింగ్‌ స్టాఫ్‌ను నియమించింది. ప్రభుత్వ జనరల్‌ ఆసుప త్రి 362పడకలుగా అప్‌గ్రేడ్‌ అయిన తరువాత ప్రభుత్వం నూతనంగా 250మంది స్టాఫ్‌ నర్సులను, నర్సులను నియ మించింది. మూడు నెలలుగా వారికి వేతనాలు ఇవ్వడం లేదు. కనీసం వారిని గుర్తింపు ఇస్తున్నట్టుగా ఐడెంటిఫికే షన్‌ కానీ, ఎంప్లాయి కోడ్‌ కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆసుపత్రిలో అడ్మినిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ వీరికి సంబంధించిన వేతనాలను చూడాల్సి ఉండగా వారి వేతనాల గురించి ఇ ప్పటికీ పట్టించుకోవడం లేదు. ఆసుపత్రి సిబ్బంది ఎన్ని సార్లు అడిగినా తమ చేతుల్లో ఏమి లేదంటూ డీఎంఈ ఆఫీస్‌కు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ నర్సింగ్‌ స్టాఫ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్న వారిని కనికరించే వారే లేరు. గతంలో తలాకొంత డబ్బులు వేసుకుని ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారి పట్ల ఎవరూ కనికరించడం లేదు. ప్రతి నెల ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందికి ఏఓ విభాగం వారి వేతనాలను డీఎంఈ ఆఫీస్‌కు పం పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వారి వేతనాలను పంప కపోవడంతో నర్సింగ్‌ స్టాఫ్‌ ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలు వసూలు..

ఆసుపత్రిలో నూతనంగా నియామకమైన నర్సింగ్‌ సిబ్బంది నుంచి వారికి వేతనాలు ఇప్పిస్తామంటూ ఒక్కొ క్కరి వద్ద నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసినట్టు తెలిసింది. సూపరింటెండెంట్‌ను కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. గత మార్చిలో ఎల్‌బీ స్టేడియంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నర్సింగ్‌ స్టాఫ్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. కానీ ఇప్పటి వరకు వారికి వేతనాలు అందలేదు. తమకు వేతనాలు ఇప్పించా లంటూ నర్సింగ్‌ సిబ్బంది వేడుకుంటున్నారు.

Updated Date - May 23 , 2024 | 12:32 AM