Share News

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:32 AM

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని దానికి అనుగుణంగా పనులు చేపడుతామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని సాంబయ్య పల్లి, గొల్లపల్లి, నారాయణరావుపల్లి, గర్రెపల్లి, ఐతరాజుపల్లి, నర్సయ్యపల్లి తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
గొల్లపల్లిలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

సుల్తానాబాద్‌, మార్చి 10: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని దానికి అనుగుణంగా పనులు చేపడుతామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని సాంబయ్య పల్లి, గొల్లపల్లి, నారాయణరావుపల్లి, గర్రెపల్లి, ఐతరాజుపల్లి, నర్సయ్యపల్లి తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ చాలా గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టవల్సి ఉందని, ముందుగా మిగిలిన అసంపూర్తిగా వదిలేసిన పనులుకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని పూర్తి చేస్తామన్నారు. రాజీవ్‌ రహదారి నుంచి గర్రెపల్లి స్కూల్‌ వరకు నిర్మించిన బీటీ రోడ్డును గ్రామంలోని చౌరస్తా వరకు పొడిగించేం దుకు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానన్నారు. నర్సయ్యపల్లి జీపీ భవనానికి ప్రహరీ నిర్మాణం పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం నిధులు కేటాయిస్తా మన్నారు. సాంబయ్యపల్లిలో మహిళభవనానికి స్థలం చూపితే నిధులు మంజూ రు చేస్తామని హామీ ఇచ్చారు. పలు గ్రామాల్లో మహిళలు మంచినీటి కొరత గురించి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చా రు. దాంతో ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. పలు గ్రామాల్లో మాజీ ప్రజాప్రతినిదులు, కాంగ్రెస్‌ నాయకులు గ్రామ ప్రముఖులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు మిను పాల ప్రకాశ్‌రావు, పన్నాల రాములు, దామోదర్‌రావు, మాజీ సర్పంచ్‌ బండారి రమేష్‌, దర్శనాల రాజు, పొల్సాని సంపత్‌రావు, రాజలింగం, ఇల్లెందుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీటీసీలు పులి అనూష, గట్టు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:32 AM