గాన రత్న, గాన కోకిల అవార్డుల ప్రదానం
ABN , Publish Date - Dec 05 , 2024 | 01:32 AM
మంథని విద్యార్థి యువత ఆధ్వ ర్యంలో ఘంటసాల జయంతిని పురస్కరించుకొని మంథనికి చెందిన గాయకు లు సర్వ చిన్నబాపును గాన రత్న, వనమాలై వనమామలై అరుణాదేవిని గాన కోకిల అవార్డులతో బుధవారం సత్కరించారు.
మంథని, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మంథని విద్యార్థి యువత ఆధ్వ ర్యంలో ఘంటసాల జయంతిని పురస్కరించుకొని మంథనికి చెందిన గాయకు లు సర్వ చిన్నబాపును గాన రత్న, వనమాలై వనమామలై అరుణాదేవిని గాన కోకిల అవార్డులతో బుధవారం సత్కరించారు. స్థానిక ఫ్రెండ్స్ క్లబ్‌లో కొండేల మారుతి అధ్యక్షతన జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అరుణాదేవి, సర్వ చిన్నబాపులు, స్థానిక సింగర్లు జవహరికుమారి, రాజేశ్వరి, పులువురు పాడిన పాటలు అందరిని అరించాయి. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అరుణాదేవి, సర్వ చిన్నబాపులు తమ జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నా పాటలు పాడటాన్ని ఆపకుండా అందరిని అలరించడం గొప్ప విషమ యమన్నారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు స్థానిక చౌరస్తాలోని ఘంటసాల విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ప్రిన్సి పాల్ తంగళ్ళపల్లి మధూకర్, సెన్సార్ బోర్డు మెంబర్ బోగోజు శ్రీనివాస్, బీజేపీ నేత కొండపాక సత్యప్రకాష్, మేడగోని రాజమౌళిగౌడ్, మాచీడి సత్య నారాయణగౌడ్, రవితేజగౌడ్, బెజ్జంకి డిగంబర్, బూడిద రాజయ్య, వేల్పుల సత్యం, నారమల్ల కృష్ణ, రాజేశ్వరి జ్యోతిరెడ్డి, వనజారాణిలు పాల్గొన్నారు.