Share News

ఉపాధి పనులకు ప్రణాళికలు సిద్దం

ABN , Publish Date - May 22 , 2024 | 12:22 AM

గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి స్థానికంగా పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. ఎక్కువ కుటంబాలకు వంద రోజుల పని కల్పించే లక్ష్యంతో అఽధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

ఉపాధి పనులకు ప్రణాళికలు సిద్దం

కరీంనగర్‌ రూరల్‌, మే 21: గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి స్థానికంగా పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. ఎక్కువ కుటంబాలకు వంద రోజుల పని కల్పించే లక్ష్యంతో అఽధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కరీంగనర్‌ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో 6,550 మంది ఉపాధి హామీ కూలీలున్నారు. వీరిలో 5,547మంది పని చేస్తున్నారు. మంగళవారం 2,118 మంది పనులు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల పని దినాలను కూలీలకు కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు 40,143 మందికి పనిదినాలు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్‌ మేరకు ఇప్పటికి 53 శాతం వరకు ఇప్పటికే పని దినాలు పూర్తయ్యాయి. అత్యధికంగా మొగ్దుంపూర్‌లో 7,576 పనిదినాలు కల్పించగా, బొమ్మకల్‌లో 6,400, గోపాల్‌పూర్‌లో 4,763, చెర్లబూత్కూర్‌ 4,655 , బొమ్మకల్‌లో 6,400, చామనపల్లిలో 4,848, ఎలబోతారం 4,210, నగునూర్‌ 4,991 పనిదినాలను కల్పించారు. గత సంవత్సరంలో 4,316 కుటుంబాలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనగా మొత్తం 409 కుటంబాలు వంద రోజుల పనిని పూర్తి చేసుకున్నాయి. అత్యధికంగా చామనపల్లిలో 73, చేగుర్తిలో 64, జూబ్లీనగర్‌లో 48, ఎలబోతారంలో 36, గోపాల్‌పూర్‌లో 33, ఇరుకుల్లలో 31, దుర్శేడ్‌ 27, నగునూర్‌లో 23 కుటుంబాలున్నాయి.

ఫ 5.25 కోట్లతో పనులు

2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.25 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 540 పనులు మంజూరయ్యాయి. పనుల ద్వారా కూలీలకు 1.25 లక్షల పని దినాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. వ్యవసాయ అనుబంధ పనులు, నీటి నిల్వ, భూగర్బ జలాలు పెంపొందించే పనులకు ప్రాధాన్యతమిచ్చారు. రైతుల భూములకు సారవంతమైన మట్టి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యాయి. వేసవి కాలంలో మండల వ్యాప్తంగా ప్రతి రోజు గ్రామానికి 150 మంది కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండగా 130 మందికి పనులు కల్పించారు.

ఫ లక్ష్యాన్ని చేరుకుంటాం...

శోభారాణి, ఉపాధి హామీ ఏపీవో

ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదలైన బడ్జెట్‌, పనిదినాల్లో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. గత సంవత్సరం లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.51 లక్షల పనిదినాల లక్ష్యంగా పెట్టుకోగా 1,49,170 పనిదినాలు కల్పించి 99 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం.

Updated Date - May 22 , 2024 | 12:22 AM